Share News

మంచి మిత్రుడు మోదీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:29 AM

ప్రధాని మోదీపై ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. నేరుగా పేరు ప్రస్తావించకుండా, తన మంచి మిత్రుడు అంటూ మోదీని ఉద్దేశించి అన్నారు. ‘భారత్‌కు చెందిన నా మిత్రుడు...

మంచి మిత్రుడు మోదీ

  • గొప్పగా పని చేస్తున్నాడు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 17: ప్రధాని మోదీపై ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. నేరుగా పేరు ప్రస్తావించకుండా, తన మంచి మిత్రుడు అంటూ మోదీని ఉద్దేశించి అన్నారు. ‘భారత్‌కు చెందిన నా మిత్రుడు గొప్పగా పనిచేస్తున్నాడు’ అంటూ కొనియాడారు. ఇటీవల మోదీకి ట్రంప్‌ ఫోన్‌చేసి మాట్లాడారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన రాగా, ట్రంప్‌ ఉత్సాహంగా స్పందించారు. ‘‘నా మిత్రుడితో చక్కని సంభాషణ నడిచింది. మేం అన్ని విషయాలూ చాలా బాగా చర్చించుకున్నాం’’ అని తెలిపారు. ట్రంప్‌ తనకు ఫోన్‌చేసిన విషయం తొలుత మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలోని పరిస్థితులపై చర్చించామన్నారు.

మరో యుద్ధం ఆపాను : ట్రంప్‌

ఇజ్రాయెల్‌- లెబనాన్‌ మధ్య పది రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఇరుదేశాల అధినేతలతో మాట్లాడి తాత్కాలిక యుద్ధ సంధికి వారిని ఒప్పించానని ఆయన పేర్కొన్నారు. తన ప్రయత్నాల ఫలితంగా34 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్‌-లెబనాన్‌ ప్రతినిధులు వాషింగ్టన్‌లో కలుసుకుని చర్చలు జరిపారన్నారు. ‘‘నేను ఇప్పటికే 9యుద్ధాలు ఆపాను. ఇది పదోవది’’ అని అన్నారు.

అమెరికా సైనికుల ఆకలి కేకలు?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: ఇరాన్‌ పోర్టుల దిగ్బంధనం కోసం మోహరించిన అమెరికా యుద్ధనౌకల్లోని సైనికులు ఆకలితో అలమటిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నౌకలో నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యూఎ్‌సఏ టుడేలో ప్రచురితమైన చిత్రాలు సోషల్‌ మీడియాలో కలకలం రేపాయి. సైనికులు తమ ఆహార నిల్వలను పొదుపుగా వాడుకోవాల్సి వస్తోందని యుద్ధనౌక యూఎ్‌సఎస్‌ ట్రిపోలీలో విధులు నిర్వర్తిస్తున్న సైనికురాలి తండ్రి ఒకరు ఆరోపించారు. మరో యుద్ధ నౌక యూఎ్‌సఎస్‌ అబ్రహాం లింకన్‌లో అందిస్తున్న ఆహారం ఏమాత్రం రుచిగా లేదని, అది సైనికులకు ఏ మూలకూ సరిపోవడం లేదని తెలిసిందని వెస్ట్‌ వర్జీనియాకు చెందిన పాస్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 06:29 AM