తల్లి అంత్యక్రియల కోసం.. చిన్మయ్ కృష్ణ దాస్‌కు 5 గంటల పెరోల్..
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:37 PM
బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఐదు గంటలపాటు పెరోల్ లభించింది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ అధికారులు ఈ తాత్కాలిక అనుమతి ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఐదు గంటలపాటు పెరోల్ లభించింది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ అధికారులు ఈ తాత్కాలిక అనుమతి ఇచ్చారు. చిట్టగాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహ్మద్ జాహిదుల్ ఇస్లాం మియా కుటుంబం చేసిన అభ్యర్థనను పరిశీలించిన అనంతరం పెరోల్‌కు అనుమతించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల సంధ్యారాణి గురువారం కన్ను మూశారు (Chinmoy Krishna Das Parole).
సంధ్యా రాణి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలోనే చిన్మయ్ కృష్ణ దాస్‌ను జైలు నుంచి పెరోల్‌పై విడుదల చేయాలని అధికారులను కుటుంబ సభ్యులు కోరారు. అయితే నిబంధనల ప్రకారం అలా పెరోల్ ఇవ్వడం కుదరదని అధికారులు పేర్కొన్నారు. తల్లి మరణించిన అనంతరం కుటుంబ సభ్యులు మళ్లీ దరఖాస్తు చేయడంతో కృష్ణదాస్‌కు ఐదు గంటల పెరోల్ మంజూరైంది. హతాజారీకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత నిర్ణీత గడువులోపు తిరిగి చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకోవాల్సి ఉంది (Chinmoy Krishna Das Jail).
చిన్మయ్ కృష్ణ దాస్‌ను 2024 నవంబర్‌లో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది (Bangladesh Hindu News). ఆ తర్వాత హత్య, హత్యాయత్నం, విధ్వంసం తదితర ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కేసుల్లో ఆయన పేరు చేర్చారు. ప్రస్తుతం ఆయనపై పలు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో జరిగిన హింసాత్మక ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్యకు సంబంధించిన కేసులోనూ చిన్మయ్ నిందితుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..