Share News

Fatal Exorcism Ritual: దెయ్యం పట్టిందని యువతిని చంపేసిన తల్లి, సోదరి

ABN , Publish Date - Jan 04 , 2026 | 08:01 AM

కొన్ని నెలల క్రితం లీ చిన్న కూతురు తనకు దెయ్యం పట్టిందని తల్లికి చెప్పింది. కేవలం క్షుద్ర పూజల కారణంగానే దెయ్యాన్ని వదలకొట్టడం సాధ్యం అవుతుందని అంది. దీంతో లీ, ఆమె పెద్ద కూతురు క్షుద్రపూజలు మొదలెట్టారు.

Fatal Exorcism Ritual: దెయ్యం పట్టిందని యువతిని చంపేసిన తల్లి, సోదరి
Fatal Exorcism Ritual

మూఢ నమ్మకాల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. సొంత తల్లి, సోదరి చేతిలో ఓ యువతి హత్యకు గురైంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌, షెన్‌జెన్‌కు చెందిన లీ అనే మహిళ ఆమె ఇద్దరు కూతుళ్లు మూఢ నమ్మకాలకు బానిసలు అయ్యారు. దెయ్యాలు పట్టడం, టెలీపతి, ఆత్మలను అమ్మటం వంటి వాటిని బాగా నమ్మేవారు. ఆ మూఢ నమ్మకాలు తారాస్థాయికి చేరటంతో అది పారానోయాకు దారి తీసింది. పారానోయా కారణంగా దెయ్యాలు తమను వేధింపులకు గురి చేస్తున్నాయన్న భ్రమలో ఉండేవారు.


కొన్ని నెలల క్రితం లీ చిన్న కూతురు తనకు దెయ్యం పట్టిందని తల్లికి చెప్పింది. కేవలం క్షుద్ర పూజల కారణంగానే దెయ్యాన్ని వదలకొట్టడం సాధ్యం అవుతుందని అంది. దీంతో లీ, ఆమె పెద్ద కూతురు క్షుద్రపూజలు మొదలెట్టారు. చిన్న కూతుర్ని నేలపై పడుకోబెట్టి ఇద్దరూ ఆమె గుండెల మీద కూర్చున్నారు. ఆమె నోట్లో నీళ్లు పోస్తూ వాంతులు చేసుకునేలా చేయసాగారు. చిన్న కూతురు తన శరీరంలోనుంచి దెయ్యం బయటకుపోతోందని, ఇంకా బాగా చేయమని ప్రోత్సహించింది.


అయితే, వారి క్షుద్రపూజలు వికటించాయి. చిన్న కూతురు రక్తం కక్కుకుని చనిపోయింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఇద్దరు నిందితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. వ్యక్తిగత నమ్మకాల కారణంగా మనుషుల ప్రాణాలకు ఇబ్బందికలగకూడదని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు

అతిగా ఆహారం.. ఆరోగ్యానికి చేటు

Updated Date - Jan 04 , 2026 | 08:04 AM