Share News

చైనాలో గూఢచర్యం చేస్తున్న తాబేళ్లు, చేపలు..

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:09 PM

చైనాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ నిఘా సంస్థలు చైనా కోస్ట్‌లైన్‌కు సంబంధించిన అండర్‌వాటర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయట.

చైనాలో గూఢచర్యం చేస్తున్న తాబేళ్లు, చేపలు..
China Spy Turtles

ఇంటర్‌నెట్ డెస్క్: చైనాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ నిఘా సంస్థలు చైనా కోస్ట్‌లైన్‌కు సంబంధించిన అండర్‌వాటర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయట. వాటికి సెన్సార్లు అమర్చి సముద్రంలోకి పంపుతున్నాయట. సున్నితమైన సమాచారాన్ని ఎంతో చాకచక్యంగా సేకరిస్తున్నాయట. ఈ విషయాన్ని చైనా దేశీయ భద్రతా మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలను తెలియజేస్తూ వీచాట్ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది.


ఆ పోస్టులో.. ‘విదేశీ నిఘా సంస్థలు చైనా సముద్ర తీరాల రహస్యాలు, సైనిక సమాచారాన్ని దొంగిలించడానికి సెన్సార్లు అమర్చిన డిటెక్షన్ బాయ్‌లు, వేవ్ గ్లైడర్లు, సముద్ర జీవులైన తాబేళ్లు, చేపలను వాడుతున్నారు. సెన్సార్లు కలిగి ఉన్న తాబేళ్లు, చేపలను చైనాలోని పలు సముద్ర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గుర్తించాం. ఆ గూఢచారి తాబేళ్లు, చేపలు నిర్దిష్ట ప్రదేశాల్లో ఈదుతూ సముద్ర పర్యావరణానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి’..


ఆ సమాచారం ఉపగ్రహం ద్వారా విదేశాలకు చేరుతోంది. చైనా మత్స్యకారులు, సముద్ర తీర ప్రాంత ప్రజలు ఇలాంటి వింత పరికరాలు లేదా అనుమానాస్పద జంతువులను గుర్తిస్తే వెంటనే జాతీయ భద్రతా సంస్థకు నివేదించాలి. దేశ భద్రతను కాపాడాలి’ అని చైనా దేశీయ భద్రతా మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.


ఇవి కూడా చదవండి

రోడ్లపై డేంజర్‌ స్టంట్లు

భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న

Updated Date - Jun 12 , 2026 | 12:19 PM