Share News

ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి: కెనడా ప్రధాని

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:58 PM

కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రత్యేకమైన వ్యక్తి అని కొనియాడారు.

ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి: కెనడా ప్రధాని
Mark Carney praises Modi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ (PM Modi) చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. బుధవారం సిడ్నీలోని (ఆస్ట్రేలియా) లోవీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెనడా ప్రధాని మాట్లాడారు. ఇటీవల భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధత ఎంతో ప్రత్యేకమైనదని కార్నీ ప్రశంసలు కురిపించారు. గత 25 ఏళ్లల్లో ఒక్క రోజు కూడా మోదీ సెలవు తీసుకోలేదన్నారు. ప్రతి వారాంతంలో ఆయన ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతారన్నారు. ప్రధాని మోదీకి తన పనిపై ఉన్న నిష్ట గొప్పదని కూడా అన్నారు. గ్రామీణ ప్రజానీకానికి సేవ చేయడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. యూపీఐపై కూడా ప్రశంసలు కురిపించారు. నేరుగా నగదు లబ్ధిదారులకు బదిలీ చేయడం ఈ వ్యవస్థతో సాధ్యమైందని అన్నారు. దీంతో, అనేక మంది ప్రధాన ఆర్థికవ్యవస్థలో భాగం కాగలిగారని అన్నారు. ఈ విషయంపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టారని కామెంట్ చేశారు.


ట్రూడో హయాంలో కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రధాని కార్నీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల భారత్‌లో కూడా పర్యటించారు. భారత దేశ ఇంధన అవసరాలు తీర్చేందుకు కెనడా తన వంతు ప్రయత్నం చేస్తుందని పర్యటన సందర్భంగా ఆయన చెప్పారు. భారత్‌కు యూరేనియం సరఫరా కోసం కెనడా సంస్థ కామేకో దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదుర్చుకుందని అన్నారు. కెనడా, భారత దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలమైనవని కామెంట్ చేశారు. రెండు మిలియన్‌ల మంది కెనడా పౌరులకు భారతీయ మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. రక్షణ రంగంలో సహాకారాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, కెనడాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లో కత్తి పోట్లతో..

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

Updated Date - Mar 05 , 2026 | 03:56 PM