Share News

9/11 దాడులకు ముందే భారత్‌పై ఉగ్రదాడికి లాడెన్‌ కుట్ర!

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:00 AM

అమెరికాలో 2001 సెప్టెంబరు 11న (9/11) దాడులకు ముందే భారత్‌పై ఉగ్రవాద దాడికి అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ కుట్ర పన్నాడా? అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తాజాగా బహిర్గతం చేసిన రహస్య ఫైళ్లు ఇదే చెబుతున్నాయి.

9/11 దాడులకు ముందే   భారత్‌పై ఉగ్రదాడికి లాడెన్‌ కుట్ర!
cia photo

వాషింగ్టన్‌, సెప్టెంబరు 13: అమెరికాలో 2001 సెప్టెంబరు 11న (9/11) దాడులకు ముందే భారత్‌పై ఉగ్రవాద దాడికి అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ కుట్ర పన్నాడా? అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తాజాగా బహిర్గతం చేసిన రహస్య ఫైళ్లు ఇదే చెబుతున్నాయి. ఈజిప్టు, కువైత్‌, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, యెమెన్‌, ఉగాండా, నైజీరియాల్లోనూ ఉగ్ర దాడులకు పథక రచన చేసినట్లు పేర్కొన్నాయి. 1998 ఆగస్టులో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కోసం సీఐఏ సిద్ధం చేసిన నోట్‌లో ఈ అంశం ఉంది. 1998 ఫిబ్రవరి నుంచి 2001 సెప్టెంబరు 12 వరకు ఉన్న ఈ డాక్యుమెంట్లలో లాడెన్‌, ఇతర ఇస్లామిస్ట్‌ ఉగ్రవాదులపై లోతుగా చర్చించారు. అయితే భారత్‌పై లాడెన్‌ ఎప్పుడు, ఏ రూపంలో, ఏ ప్రాంతంలో దాడి చేయాలనుకున్నాడో సీఐఏ వివరాలు చెప్పలేదు. 9/11 దాడులకు రెండేళ్లు సన్నాహాలు చేశారని.. వాషింగ్టన్‌లోని యూఎస్‌ క్యాపిటల్‌ హిల్‌ కూడా టార్గెట్లలో ఒకటిగా ఉందని పేర్కొంది.

Updated Date - Sep 14 , 2026 | 06:00 AM