నల్ల సముద్రంలో తుర్కియే ట్యాంకర్‌పై దాడి
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:05 AM
రష్యా నుంచి చమురు నింపుకొని సియోర్రా లియోన్‌కు వెళుతున్న తుర్కియే చమురు ట్యాంకర్ నౌక ‘ఆల్ట్యూరా’పై దాడి జరిగింది...
రష్యా నుంచి చమురు నింపుకొని సియోర్రా లియోన్‌కు వెళుతున్న తుర్కియే చమురు ట్యాంకర్ నౌక ‘ఆల్ట్యూరా’పై దాడి జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు సమీపంలోని బొస్ఫొరస్ జలసంధి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తుర్కియే రవాణా మంత్రి అబ్దుల్ కదీర్ తెలిపారు. సముద్రంలోని బోటు నుంచి ఈ నౌకలోని ఇంజన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని.. అందులోని సిబ్బందిని రక్షించామని వెల్లడించారు. నౌకలో 10లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..