టాయిలెట్ పేపర్‌కు యమ డిమాండ్
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:33 AM
అమెరికాకు ఇప్పుడు మంచి రోజులు నడవడం లేదని భావిస్తున్న స్థానిక ప్రజలు సరుకులను పెద్దఎత్తున కొని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు.
భారీగా కొని నిల్వ చేసుకుంటున్న అమెరికన్లు
వేలంవెర్రిగా అత్యవసర సరుకుల కొనుగోలు
బ్లాకౌట్ భయాలతో ‘జాగ్రత్త’ పడుతున్న ప్రజలు
వాషింగ్టన్, నవంబరు 25: అమెరికాకు ఇప్పుడు మంచి రోజులు నడవడం లేదని భావిస్తున్న స్థానిక ప్రజలు సరుకులను పెద్దఎత్తున కొని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టాయిలెట్ పేపర్లు, జనరేటర్లు, ఫ్రీజ్ డ్రైయిడ్ పుడ్ వంటి అత్యవసర సరుకులను వేలంవెర్రిగా కొంటున్నారు. అమెరికాలో కృత్రిమ మేధ(ఏఐ) సంబంధ సమస్యలతో వ్యవస్థలు తరచూ ఇబ్బంది పడుతున్నాయి. దీంతో రానున్న కాలం ఎలా ఉండబోతుందోననే భయం అమెరికా పౌరులను వేధిస్తోంది. ఫలితంగా ఎడాపెడా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ పరిణామం అత్యవసర వస్తువుల ధరలను అమాంతం పెంచేసిందని ‘బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్’ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా భారీ డిస్కౌంట్ల ప్రకటనకు రిటైలర్లు సిద్ధం అవుతున్న వేళ కూడా ఆన్లైన్లో ధరలకు రెక్కలు రావడం విశేషం. ఫ్రీజ్ డ్రైయిడ్ ఫుడ్ ధరలు 12ు పెరిగాయి. ట్రాక్ చేసిన లిస్టులో మూడో వంతు సరుకులు దొరకడం లేదని, అదే గత ఏడాది ట్రాక్ చేసిన 16 సరుకుల లిస్టులో ఒకటి మాత్రమే లభ్యం కాలేదని ‘బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్’ తెలిపింది. కొందామన్నా ఆన్లైన్లో జనరేటర్లు దొరకడం లేదు. ఇరాన్‌తో యుద్ధం తర్వాత అమెరికాలో చమురు ధరలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ధరలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.