స్కామర్ల స్థావరాలు కూల్చివేశాం
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:50 AM
తమ దేశంలో పెద్దఎత్తున స్కామర్ల స్థావరాలను కూల్చి వేశామని కంబోడియా ప్రధాని హున్ మానెట్ చెప్పారు. కంబోడియా నుంచి జరుగుతున్న మోసాలను నిర్మూలించామని తెలిపారు.
కంబోడియా ప్రధాన మంత్రి ప్రకటన
పొనామ్ పెన్ (కంబోడియా), సెప్టెంబరు 23: తమ దేశంలో పెద్దఎత్తున స్కామర్ల స్థావరాలను కూల్చి వేశామని కంబోడియా ప్రధాని హున్ మానెట్ చెప్పారు. కంబోడియా నుంచి జరుగుతున్న మోసాలను నిర్మూలించామని తెలిపారు. మాదకద్రవ్యాలు, నేరాలు, ఇంటర్‌పోల్‌పై ఐక్యరాజ్యసమితి రెండు రోజుల సదస్సుకు కంబోడియా ఆతిథ్యమిచ్చింది. రెండో రోజైన బుధవారం ప్రధాని మానెట్ హాజరయ్యారు. పెద్ద స్థాయిలో ఉన్న స్థావరాలను ధ్వంసం చేయడంతో వాటి నిర్వాహకులు చిన్న గ్యాంగులుగా విడిపోయారని ఆయన చెప్పారు. ఎలాంటి వాటినైనా కూల్చివేయడానికి తమ నిఘా వ్యవస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు. వందలాది నేర స్థావరాలను ఆగస్టులోనే మూసివేయించామని చెప్పారు.