మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:07 AM
ఒమన్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు మస్కట్, సలాల నగరాల్లో...
ఒమన్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి
ఒమన్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు మస్కట్, సలాల నగరాల్లో వేర్వేరుగా జయంతి ఉత్సవాలను నిర్వహించాయి. అలాగే, మస్కట్‌లో అంబేడ్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఆధ్వర్యాన సమితి అధ్యక్షుడు గాలిగాని రాజు అధ్యక్షత కార్యక్రమం జరిగింది. ఇందులో భారతీయ రాయబారి జీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, సమితి ఉపాధ్యక్షుడు రంజిత్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి రెడ్డి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అంబేడ్కర్ బోధనలు చిరకాలం దిక్సూచిలా ఉంటాయని ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు నూనె రాజన్న అన్నారు. మస్కట్ నుంచి వేయి కిలోమీటర్ల దూరంలోని సలాల నగరంలో జరిగిన ఉత్సవాలకు ఉపాధ్యక్షుడు రాకేశ్ అధ్యక్షత వహించగా.. మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి సమన్వయం చేసుకున్నారు. రాజధాని మస్కట్‌లో మరో రెండు చోట్ల కూడా ఉత్సవాలు నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్