పశ్చిమాసియాలో శాంతిపై యూఏఈ అధ్యక్షుడితో అజిత్ డోభాల్ చర్చ
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:57 AM
పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్..
అబుదాబి, ఏప్రిల్26: పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ శనివారం అబుదాబిలో చర్చించారు. ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణల వల్ల తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో, భద్రతా పరమైన అంశాలు, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఇరు దేశాల మధ్య సమన్వయంపై ఉభయులు చర్చలు జరిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ముప్పు పొంచి ఉన్న తరుణంలో సరఫరా వ్యవస్థను కాపాడడం, హోర్ముజ్‌జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో సముద్ర భద్రతను పటిష్ఠం చేయడంపై భేటీలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.