ఏఐ సంస్థలది అక్రమ ఒప్పందం
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:15 AM
భద్రతా కారణాల రీత్యా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని దిగ్గజ ఏఐ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం చట్ట వ్యతిరేకమని అమెరికాలోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్ద కంపెనీలు తమకు పోటీగా ఇతరులు రాకుండా సిండికేట్‌గా ఏర్పడి కుట్రపూరితంగా ఈ ఒప్పం దం చేసుకున్నాయని ఆ పిటిషన్‌లో ఆరోపించారు.
ఏఐ మోడళ్ల అభివృద్ధిని
నిదానించాలన్న డీల్ చట్ట విరుద్ధం
అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా
కోర్టులో ఏఐ వినియోగదారుల పిటిషన్
వాషింగ్టన్, సెప్టెంబరు 20: భద్రతా కారణాల రీత్యా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని దిగ్గజ ఏఐ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం చట్ట వ్యతిరేకమని అమెరికాలోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్ద కంపెనీలు తమకు పోటీగా ఇతరులు రాకుండా సిండికేట్‌గా ఏర్పడి కుట్రపూరితంగా ఈ ఒప్పం దం చేసుకున్నాయని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో నలుగురు ఏఐ వినియోగదారులు శనివారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించేందుకు ఈ పరిశ్రమ మొత్తం కలిసిరావాలని ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డేరియో అమోడై ఈ నెల 12 ప్రచురించిన ఒక వ్యాసం ద్వారా పిలుపునిచ్చారు. అందుకు తాము సిద్ధమేనని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్, స్పేస్‌ఎక్స్ ఏఐ సీఈవో ఎలాన్ మాస్క్, గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు డెమిస్ హస్సబిసులు అదేరోజు ప్రకటించారు. ఈ పరిణామం అప్పటికప్పుడు జరిగింది కాదని, వీరంతా రెండుమూడు నెలల ముందే ఈ ఒప్పందంపై రహస్యంగా ఒక అవగాహనకు వచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. కాగా, ఏఐ రంగాన్ని ధ్వంసం కానివ్వబోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తమ ప్రభు త్వం ఏఐ రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పారు.