Share News

గత ఏడేళ్లలో ఇజ్రాయెల్‌ ప్రధానుల జుట్టు, మేకప్‌ కోసం 4.5 కోట్లు

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:04 AM

ఇజ్రాయెల్‌ ప్రధానులు తమ జట్టు అలంకరణ (హెయిర్‌ స్టైలింగ్‌), మేకప్‌, దుస్తుల కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు! 2019-2026 ఆగస్టు మధ్య ఏడేళ్లలో ఆ దేశానికి ప్రధానులుగా చేసిన వారి కేశాలంకరణ, మేకప్‌ కోసం 4.7లక్షల డాలర్ల (రూ.4.5 కోట్లు) మేర దేశ, విదేశాల్లో వ్యయం అయిందట!!

గత ఏడేళ్లలో ఇజ్రాయెల్‌ ప్రధానుల   జుట్టు, మేకప్‌ కోసం 4.5 కోట్లు
nethanayu

  • 90 శాతం ఖర్చు నెతన్యాహూ దంపతులదే

  • యుద్ధ సమయంలోనూ తగ్గని ‘అలంకరణ’

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ఇజ్రాయెల్‌ ప్రధానులు తమ జట్టు అలంకరణ (హెయిర్‌ స్టైలింగ్‌), మేకప్‌, దుస్తుల కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు! 2019-2026 ఆగస్టు మధ్య ఏడేళ్లలో ఆ దేశానికి ప్రధానులుగా చేసిన వారి కేశాలంకరణ, మేకప్‌ కోసం 4.7లక్షల డాలర్ల (రూ.4.5 కోట్లు) మేర దేశ, విదేశాల్లో వ్యయం అయిందట!! గతేడాది డిసెంబరులో ‘సమాచార స్వేచ్ఛా ఉద్యమం’ తరఫున యారా వింక్లర్‌ షాలిత్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందనగా ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయమే ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం వ్యయంలో 90 శాతాన్ని కేవలం ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, ఆయన భార్య సారా కోసమే ఉపయోగించారు. 2023లో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో కూడా సెప్టెంబరు-నవంబరు మధ్య ప్రధాని నెతన్యాహూ హెయిర్‌ స్టైలింగ్‌ కోసం సుమారు 2600 డాలర్లు, మేకప్‌ కోసం 1580 డాలర్ల మేర ప్రభుత్వం చెల్లించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. 2023లో ఒక్క అక్టోబరు నెలలోనే ప్రధాని జుట్టు కోసం ప్రత్యేకంగా 810 డాలర్లు వ్యయం చేశారు. అంతకుముందు ప్రధానుల కంటే నెతన్యాహూ కోసం చేసిన ఖర్చు చాలా ఎక్కువ. 2022లో నఫ్తాలీ బెనెట్‌, లాయిడ్‌ ప్రధానులుగా ఉన్న సమయంలో వార్షిక ఖర్చు 27 వేల డాలర్లు మాత్రమే ఉండగా, నెతన్యాహూ హయాంలో అది 2023లో 1.03 లక్షల డాలర్లకు, 2025లో అత్యధికంగా 1.11లక్షల డాలర్లకు పెరిగింది.

Updated Date - Sep 13 , 2026 | 05:04 AM