Share News

Indian Woman In US Flat: అమెరికాలో దారుణం.. మాజీ ప్రియుడి ఇంట్లో శవమైన భారత యువతి..

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:55 AM

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల ఓ భారతీయ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆమె అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చాడు.

Indian Woman In US Flat: అమెరికాలో దారుణం.. మాజీ ప్రియుడి ఇంట్లో శవమైన భారత యువతి..
Indian Woman In US Flat

అమెరికాలో ఓ భారతీయ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆమెను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. కేసును తప్పుదోవపట్టించడానికి ఓ పెద్ద ప్లానే వేశాడు. అయితే, అతడి ప్లాన్ వర్కవుట్ కాలేదు. పోలీసులు మర్డర్ కేసును ఇట్టే ఛేదించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇల్లీకాట్ సిటీకి చెందిన 27 ఏళ్ల నిఖిత గోదిశాల డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పని చేస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు ఆమె అర్జున్ శర్మ అనే 26 ఏళ్ల యువకుడితో రిలేషన్‌లో ఉండేది.


కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. డిసెంబర్ 31వ తేదీన నిఖిత మేరీల్యాండ్ సిటీలోని అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ అర్జున్ అతి దారుణంగా కత్తితో పొడిచిపొడిచి నిఖితను చంపేశాడు. జనవరి 2వ తేదీన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిఖిత కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీన నిఖిత.. అర్జున్ అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. జనవరి 3వ తేదీన అర్జున్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.


అర్జున్ ప్లాట్‌‌లో నిఖిత శవం వెలుగు చూసింది. అయితే, నిఖిత గురించి మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత అర్జున్ చాలా తెలివిగా అదే రోజు ఇండియాకు వచ్చేశాడు. అతడు నిఖితను ఎందుకు చంపాడన్నది తెలియరాలేదు. హౌవర్డ్ కౌంటీ పోలీసులు అర్జున్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి, అతడిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ ఎంబసీ నిఖిత కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. తగిన సాయం చేసే పనిలో ఉంది. స్థానిక అధికారులతో ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉంది.


ఇవి కూడా చదవండి

బెంగళూరులో దారుణం.. ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి

వెనుజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..

Updated Date - Jan 05 , 2026 | 07:25 PM