Share News

ఆ ప్రొటీన్‌తో మనిషి 200 ఏళ్లు బతికే అవకాశం.. వెలుగులోకి అద్భుత విషయాలు..

ABN , Publish Date - Apr 25 , 2026 | 03:10 PM

బౌహెడ్ వేల్స్‌ 200 ఏళ్ల పాటు జీవిస్తుంటాయి. వాటి రోగ నిరోధక శక్తి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంతోటే యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌కు చెందిన సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేశారు.

ఆ ప్రొటీన్‌తో మనిషి 200 ఏళ్లు బతికే అవకాశం.. వెలుగులోకి అద్భుత విషయాలు..
human lifespan 200 years

ఇంటర్‌నెట్ డెస్క్: బౌహెడ్ వేల్స్‌పై యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌కు చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో అద్భుత విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనుషులు 200 ఏళ్లు జీవించే మార్గాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. బౌహెడ్ వేల్స్‌ 200 ఏళ్ల పాటు జీవిస్తుంటాయి. వాటి రోగ నిరోధక శక్తి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంతోటే యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌కు చెందిన సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో బౌహెడ్ వేల్స్ ఎందుకు 200 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నాయో తెలిసిపోయింది.


బౌహెడ్ వేల్స్‌లో సీఐఆర్‌బీపీ అనే ప్రొటీన్ ఉంటుంది. అది డీఎన్‌ఏలో జరిగే డబుల్ స్ట్రాండ్ బ్రేక్స్‌ను రిపేర్ చేస్తుంది. సాధారణంగా డీఎన్‌ఏలో జరిగే డబుల్ స్ట్రాండ్ బ్రేక్స్‌ కారణంగానే రోగాలు వస్తుంటాయి. జీవితకాలం బాగా తగ్గిపోతుంది. బౌహెడ్ వేల్స్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ క్షీరదాలలో ఉండే దాని కంటే 100 రెట్లు ఎక్కువగా సీఐఆర్‌బీపీ ప్రొటీన్ వీటిలో ఉంటుంది. సైంటిస్టులు సీఐఆర్‌బీపీ ప్రొటీన్‌ను మనుషుల హ్యూమన్ సెల్ కల్చర్స్, ఫ్రూట్ ఫ్లై కణాలతో కలిపారు. రెండిటిలోనూ డీఎన్ఏ రిపేర్ మెరుగుపడింది. వాటి జీవితకాలం పెరిగింది.


తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా సీఐఆర్‌బీపీ ప్రొటీన్ ఉత్పత్తి పెరిగింది. బౌహెడ్ వేల్స్ గడ్డ కట్టే ఆర్కిటిక్ జలాల్లో జీవిస్తుంటాయి. చలి కారణంగా సీఐఆర్‌బీపీ ప్రొటీన్ ఉత్పత్తి సహజ సిద్ధంగా పెరుగుతుంది. సైంటిస్టులు వివిధ రకాలుగా మనుషుల్లో సీఐఆర్‌బీపీ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌ సైంటిస్టులు చేసిన ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.


ఇవి కూడా చదవండి

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..

డ్రైవర్ కేసులో మరో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

Updated Date - Apr 25 , 2026 | 03:16 PM