అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. పిల్లల మెదడు స్పందనల్లో మార్పులు
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:36 PM
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడు స్పందనల్లో మార్పులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 8.7 ఏళ్ల సగటు వయసున్న చిన్నారులపై ఎమ్మారై పరీక్షల సాయంతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్కెరొలీనా, కైసర్ పర్మనెంటే శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడు స్పందనల్లో మార్పులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 8.7 ఏళ్ల సగటు వయసున్న చిన్నారులపై ఎమ్మారై పరీక్షల సాయంతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్కెరొలీనా, కైసర్ పర్మనెంటే శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
మెదడులోని డార్సల్ స్ట్రయాటమ్ అనే భాగం అలవాట్లతో ముడి పడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు, ఇతర అడిటివ్స్తో పారిశ్రామికంగా తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే పిల్లల డార్సల్ స్ట్రయాటమ్లలో బలమైన స్పందనలు కనిపించాయని చెప్పారు. ఈ ఫుడ్స్ వైపు పిల్లల బలంగా ఆకర్షితమవుతున్నట్టు చెప్పారు. ఇలాంటి చిన్నారుల్లో మరుసటి ఏడాది బీఎంఐ పెరిగే అవకాశాలు పెరిగాయని గుర్తించారు.
కొవ్వులు, పిండిపదార్థాల ప్రత్యేక కాంబినేషన్ల కారణంగా ఈ తరహా బలమైన స్పందనలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఊబకాయంపై చర్చకు కొత్త దిశను ఈ అధ్యయనం ఇచ్చిందని న్యూట్రిషన్ అడ్వొకెసీ ఇన్ పబ్లిక్ ఇంట్రస్ట్ (ఎన్ఏపీఐ) సంస్థ కన్వీనర్ డా.అరుణ్ గుప్తా అన్నారు. అలస్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వ్యసనంగా మారుతున్న వైనంపై చర్చ జరగాలని చెప్పారు. పిల్లల ఆహారపు అలవాట్లు ఇకపై కేవలం వ్యక్తిగత అభిరుచి, తల్లిదండ్రుల మార్గదర్శనానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు.
అధిక చక్కెరలు ఉన్న ఫుడ్స్‌పై ప్రత్యేక హెచ్చరిక లేబుల్స్ ఉండాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విషయంపై దృష్టిసారించాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలోనే ఆహార నియంత్రణ సంస్థను ఆదేశించింది. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి స్పందన లేకపోవడంతో ఆగస్టులో సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకోవట్లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు ప్రచారంకల్పించే యాడ్స్‌పై నిషేధం విధించాలంటూ ఎన్ఏపీఐ కూడా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
దీపావళి వేళ వాయు కాలుష్యంతో జాగ్రత్త.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ టిప్స్!
లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా..!