Share News

ఎక్సర్‌సైజుల తరువాత చెరకు రసం తాగుతున్నారా? మరి ఈ విషయాలు తెలుసా?

ABN , Publish Date - Mar 24 , 2026 | 01:33 PM

జిమ్‌లో కసరత్తుల తరువాత చెరకు రసం తాగే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎక్సర్‌సైజుల తరువాత చెరకు రసం తాగుతున్నారా? మరి ఈ విషయాలు తెలుసా?
Sugar Cane Juice after Workout Session

ఇంటర్నెట్ డెస్క్: జిమ్‌లో కసరత్తుల తరువాత శరీరం అలసిపోతుంది. దాహం కూడా వేస్తుంది. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఎనర్జీ డ్రింక్స్‌ను తాగుతారు. కొందరు చెరకు రసాన్ని తాగుతారు. ముఖ్యంగా ఎండాకాలంలో కసరత్తుల తరువాత చెరకు రసం తాగేవారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి అలవాటు ఉన్న వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు (Sugar cane Juice After Workout).

వాస్తవానికి మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ స్పోర్ట్స్ డ్రింక్స్‌తో పోలిస్తే చెరకు రసం బెటరే. ఇందులో తక్షణ శక్తిని ఇచ్చే చక్కెరలతో పాటు యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఫలితంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కసరత్తుల కారణంగా చెమట రూపంలో శరీరం తేమను కోల్పోతుంది. డీహైడ్రేషన్ బారిన పడుతుంది. కాబట్టి, నీటి శాతం అధికంగా ఉన్న చెరకు రసం తాగితే డీహైడ్రేషన్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.


ఇక కసరత్తుల తరువాత శరీరానికి ప్రొటీన్లు అవసరమవుతాయి. అయితే, చెరకులో ప్రొటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, కేవలం చెరకు రసం మీదే ఆధారపడితే కండరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక వీధుల పక్కన స్టాల్స్‌లో చేసే చెరకు రసంతో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. చెరకులోని అధిక చక్కెరల కారణంగా డయాబెటిస్ రోగులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కసరత్తుల తరువాత చెరకు రసాన్ని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చెరకు రసంతో పాటు కోడి గుడ్లు, ప్రొటీన్ షేక్స్ వంటివి తీసుకుంటే మంచి ప్రయోజనం దక్కుతుందని అంటున్నారు. ఇక ఓ మోస్తరు కసరత్తులు చేసే వారు చెరకు రసాన్ని వీలైనంత పరిమితంగా తాగితే బెటర్ అని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి:

ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే

30 ఏళ్లు దాటాయా? ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే..

Updated Date - Mar 24 , 2026 | 01:52 PM