Share News

నిద్రలేమి.. కీళ్ల నొప్పులు పెరుగుతాయా?

ABN , Publish Date - Aug 11 , 2026 | 02:40 PM

సరైన నిద్ర లేకపోవడం వల్ల అలసట, నీరసం మాత్రమే కాదు.. ఎముకలు, కీళ్లు, కండరాల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల కండరాల నొప్పి పెరగడంతో పాటు ఇప్పటికే ఉన్న కీళ్ల సమస్యలు మరింత తీవ్రం కావచ్చు.

నిద్రలేమి.. కీళ్ల నొప్పులు పెరుగుతాయా?
Sleep Deprivation Effects on Bones

ఇంటర్నెట్ డెస్క్: నిద్రలేమి వల్ల కేవలం అలసట, నీరసం మాత్రమే కాకుండా కండరాలు, ఎముకలు, కీళ్లపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా చాలామంది యువత సరైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రకు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


నిద్రలేమికి కారణాలేంటి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తప్పుడు భంగిమలో కూర్చోవడం, సరైన దినచర్య లేకపోవడం, జీవనశైలిలో మార్పులు నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళన కారణంగా కండరాలు బిగుసుకుపోతాయి. నిద్రపోయే సమయం, నిద్ర విధానంలో మార్పులు కూడా ఎముకలు, కండరాలు, కీళ్లపై ప్రభావం చూపుతాయి. పడుకునే ప్రదేశం, పరుపు నాణ్యత కూడా నిద్రపై ప్రభావం చూపే అంశాల్లో ఉన్నాయి.

ఎక్కువసేపు కూర్చుంటే జాగ్రత్త

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునే విద్యార్థులు, ఉద్యోగులు తరచుగా ముందుకు వంగి పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెడ, వీపుపై ఒత్తిడి పెరుగుతుంది. తొడ వెనుక భాగంలోని కండరాలు, పిక్కల కండరాలు బిగుసుకుపోవచ్చు. దీంతో మోకాళ్లు, వీపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల కండరాల్లో అలసట, నొప్పి పెరుగుతాయి. ఈ నొప్పి రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోవడానికి కూడా ఆటంకం కలిగించవచ్చు. దీర్ఘకాలంలో కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ వంటి సమస్యల ముప్పు కూడా పెరగవచ్చు.


ఒత్తిడి, ఆందోళనను నిర్లక్ష్యం చేయొద్దు

చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఇతరులు ఏమనుకుంటారోననే భయంతో బయటకు చెప్పరు. దీంతో అసలు సమస్య తీవ్రత బయటకు రాకపోవచ్చు. అందుకే మానసిక ఒత్తిడి, ఆందోళనపై అవగాహన పెంచుకోవడం, అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం ముఖ్యం.

నిద్రలేమి వల్ల కండరాల నొప్పి పెరుగుతుందా?

సరైన నిద్ర లేకపోతే శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి, కండరాలు కోలుకోవడానికి తగిన సమయం దొరకదు. ముఖ్యంగా గాఢమైన నిద్రలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్ర సరిగా లేకపోతే కండరాల అలసట, బిగుతు, నొప్పి పెరగవచ్చు. ఇప్పటికే మెడ, వీపు లేదా కీళ్ల నొప్పితో బాధపడుతున్నవారిలో నిద్రలేమి సమస్యను మరింత తీవ్రం చేయవచ్చు.

ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇందుకోసం సరైన భంగిమలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. నిరంతరం నిద్రలేమి, శరీర నొప్పులు లేదా కీళ్ల నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులని సంప్రదించాలి. అవసరమైతే ఎముకలు, కీళ్ల నిపుణుల సలహా తీసుకుని తగిన చికిత్స పొందడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 11 , 2026 | 02:47 PM