ఎక్కువ ప్రోటీన్ తింటున్నారా? శరీరానికి కలిగే 5 ప్రమాదకర దుష్ప్రభావాలు ఇవే!
ABN , Publish Date - Aug 06 , 2026 | 01:59 PM
కండరాల పెరుగుదల కోసం ప్రొటీన్ తీసుకోవడం మంచిదే. కానీ అవసరానికి మించి ప్రొటీన్ తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు కంటే హానినే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కండరాల పెరుగుదల, శరీరానికి బలం కోసం ప్రొటీన్ చాలా అవసరం. కానీ అవసరానికి మించి ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేయకుండా, కొన్ని తీవ్రమైన సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటికే ఉన్న వ్యాధులు మరింత తీవ్రమవుతాయి
అధికంగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
జీర్ణ సమస్యలు, గ్యాస్
ఎక్కువ ప్రొటీన్ తీసుకునే వారు చాలాసార్లు ఫైబర్ ఉన్న ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. అందుకే ప్రొటీన్‌తో పాటు ఫైబర్ కూడా తగినంత తీసుకోవాలి.
మూత్రపిండాలపై ఒత్తిడి
అధిక ప్రొటీన్‌ను జీర్ణం చేసి వ్యర్థాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలం ఇలా కొనసాగితే మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ప్రొటీన్ తీసుకోవాలి.
శరీరంపై అదనపు భారం
అవసరానికి మించి ప్రొటీన్ తీసుకోవడం వల్ల కాలేయం, ఎముకలు, మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కొందరిలో అలసట, అసౌకర్యం, జీవక్రియలో మార్పులు కూడా కనిపించవచ్చు.
అధిక రక్తపోటు ప్రమాదం
కొన్ని సందర్భాల్లో అధిక ప్రొటీన్ ఆహారం అధిక రక్తపోటు సమస్యను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే బీపీ ఉన్నవారు వైద్యుల సూచనల మేరకే ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. లేకపోతే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయం
ప్రొటీన్ మన శరీరానికి అవసరమే. కానీ అది కూడా పరిమితిలోనే తీసుకోవాలి. ప్రొటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉండే ఆహారమే ఆరోగ్యానికి మంచిది. రోజుకు ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసుకోవడానికి డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు