చికాగో యూనివర్సిటీలో కొత్త ఏఐ మాస్టర్స్ కోర్సు.. 9 నెలల్లోనే పూర్తి..
ABN , Publish Date - Oct 21 , 2026 | 06:03 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచంలో సంచలనమైన అంశం. దీనివల్ల సాంకేతిక రంగంలో ప్రపంచం మరింత దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో..
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచంలో సంచలనమైన అంశం. దీనివల్ల సాంకేతిక రంగంలో ప్రపంచం మరింత దూసుకుపోతుంది. దీంతో ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు విద్యార్థులు, యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమఖు చికాగో యూనివర్శిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ రంగంలో ఉన్నత విద్యను అందించేందుకు చికాగో యూనివర్సిటీ (University of Chicago) నడుం బిగించింది.
ఏఐ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సరికొత్తగా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (MS in Applied AI) ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. తొమ్మిది నెలల పూర్తి కాలపు (ఫుల్-టైమ్) ఈ కోర్సు మొదటి బ్యాచ్ 2027 త్వరలో ప్రారంభం కానుంది. చికాగో యూనివర్సిటీకి చెందిన ఫిజికల్ సైన్సెస్ డివిజన్, డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక కోర్సును రూపొందించాయి. సాంకేతిక నేపథ్యం ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ సిలబస్‌ను తీర్చిదిద్దారు.
కేవలం ప్రాథమిక అంశాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు ఆధునిక ఏఐ సాంకేతికతలపై పట్టు సాధించేలా ఈ కోర్సును రూపొందించారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ సిస్టమ్స్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ గవర్నెన్స్, లీడర్షిప్ వంటి అంశాలకు ఈ ఏఐ కోర్సు అందించనుంది. దీని ద్వారా విద్యార్థులు మల్టీమోడల్ ఏజెంట్లు, క్వాంటమ్ కంప్యూటేషన్, బయోమెడిసిన్, ప్రొడక్షన్ ఏఐ వంటి పలు ప్రత్యేక విభాగాల్లో ఎలెక్టివ్స్ను ఎంచుకునే అవకాశం ఉంది. పరిశ్రమల్లో వస్తున్న వేగవంతమైన మార్పులకు, ఏఐ నిపుణుల కొరతకు ఈ కోర్సు చక్కటి పరిష్కారమవుతుందని వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ అర్నాబ్ బోస్ తెలిపారు. టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వస్తున్న ఈ నూతన మాస్టర్స్ కోర్సుపై విద్యార్థుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..