Share News

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టుకు ఎన్‌టీఏ ఆదేశాలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 09:37 PM

యూజీసీ నెట్‌-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది.

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టుకు ఎన్‌టీఏ ఆదేశాలు
UGC-Net 2026

ఇంటర్నెట్ డెస్క్: యూజీసీ నెట్‌-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఈ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లో పలు పొరపాట్లు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో రీటెస్టు నిర్వహించేందుకు ఎన్‌టీఏ నిర్ణయించింది. అనువాద దోషాలతో పాటు టైపోగ్రాఫికల్, ఫ్యాక్చువల్ తప్పులు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కూడా ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ సూచనల మేరకు మూడు పేపర్లకు సంబంధించి రీటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపింది.


సెప్టెంబర్ 9న ఉదయం షిఫ్టులో (1వ షిఫ్ట్) ఇంగ్లిష్ పరీక్ష, మధ్యాహ్నం షిఫ్ట్‌లో (2వ షిఫ్ట్‌) కామర్స్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న ఉదయం షిఫ్ట్‌లో సోషియాలజీ పరీక్ష ఉంటుంది. రీటెస్టుకు హాజరయ్యే వారు అదనపు ఫీజులేవీ చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుల వివరాలన్నీ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని చెప్పింది. ఇక మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల అవుతాయని కూడా ఎన్‌టీఏ పేర్కొంది. ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జేఆర్‌ఎఫ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు.


ఈ వార్తలనూ చదవండి:

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Updated Date - Aug 16 , 2026 | 09:47 PM