పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:57 PM
పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు15: పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల వయో పరిమితి సడలింపునకు అదనంగా మరో రెండేళ్లు రిలాక్సేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం ఏడేళ్ల వరకు అదనపు వయోపరిమితి సడలింపును వర్తింప చేస్తోంది. సివిల్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లకు కూడా తాజా సడలింపు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
SCT PC (Civil), సమాన స్థాయి పోస్టులకు వర్తింపు
SCT SI (Civil), సమాన స్థాయి పోస్టులకు వర్తింపు
SCT PC (Mechanic), SCT PC (Driver) పోస్టులకు వర్తింపు
SCT SI (FPB) పోస్టుకు కూడా వయో సడలింపు వర్తింపు
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి
ఆగస్టు 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం
పూర్తి వివరాలు TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tgprb.inలో అందుబాటులో ఉన్నాయి.