Government Jobs 2026: జాబ్ కార్నర్
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:58 AM
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మన్, ఎన్‌సీఆర్‌టీలో నాన్ - అకడమిక్ పోస్టులు, బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్(జీడీ), హార్టికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్స్...
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మన్
కొచ్చిన్ షిప్‌యార్డ్ వర్క్‌మన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మన్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్) 30, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, సివిల్ ఇన్‌స్ట్రుమెంటేషన్) 53, లేబరేటరీ అసిస్టెంట్(మెకానికల్, కెమికల్) 6, స్టోర్ కీపర్ 9, అసిస్టెంట్ 34
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/డిప్లొమా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 12
వెబ్‌సైట్: www.cochinshipyard.in
ఎన్‌సీఆర్‌టీలో నాన్ - అకడమిక్ పోస్టులు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్(ఎన్‌సీఈఆర్‌టీ) సహా వివిధ ప్రాంతీయ సంస్థల్లో ఏ, బీ, సీ నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: గ్రూప్ ఎ - 9, గ్రూప్ బీ - 26, గ్రూప్ సీ - 138 మొత్తం 173 పోస్టులు.
వివరాలు: సూపరింటెండెంట్, ఇంజనీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, బిజినెస్ మేనేజర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీకి తోడు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక: పోస్టునుబట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 16
వెబ్‌సైట్: www.ncert.nic.in
బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్(జీడీ)
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎ్‌సఎ్‌ఫ)లో స్పోర్ట్స్ కోటా కింద 549 కానిస్టేబుల్(జీడీ) పోస్టులు ఉన్నాయి. మహిళలకు 272, పురుషులకు 277 ప్రత్యేకించారు.
అర్హత: పదోతరగతి పాసై ఉండాలి. ప్రతిభావంతులైన క్రీడాకారులు అయి ఉండాలి. అలాగే జాతీయ/ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన లేదా ఆ పోటీల్లో పాల్గొని ఉండాలి
వయస్సు: 18-23 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, క్రీడల్లో చూపిన ప్రతిభ, డాక్యుమెంట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 15
వెబ్‌సైట్: rectt.bsf.gov.in
హార్టికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్స్
సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్న శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ - టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17
విభాగాలు: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రానమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ఫ్రూట్ సైన్స్, జీపీబీఆర్, ప్లాంట్ పాథాలజీ, పీఎ్‌సఎంఏ, స్టాటిస్టిక్స్, వెజిటిబుల్స్, ఫ్లోరికల్చర్
ఎంపిక: ఏపీఐ అండ్ పీబీఏఎస్ స్కోర్, ఉద్యోగానుభవం తదితరాలు
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 31 వెబ్‌సైట్: www.skltghu.ac
ఇవీ చదవండి: