Hospitality Career Industry: ఆసక్తిపరులకే అనువైనది ఆతిథ్య రంగం
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:08 AM
ఇంటర్‌లో ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ చేయదగ్గ కోర్సుల్లో హోటల్ మేనేజ్‌మెంట్ ఒకటి. ఆహారం అంతకుమించి ఆతిథ్యంపై ఆసక్తి ఉంటే, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు...
ఎక్స్‌పర్ట్ వాయిస్
ఇంటర్‌లో ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ చేయదగ్గ కోర్సుల్లో హోటల్ మేనేజ్‌మెంట్ ఒకటి. ఆహారం అంతకుమించి ఆతిథ్యంపై ఆసక్తి ఉంటే, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్‌మెంట్ ఒక కోర్సుగా రూపు తీసుకోవడానికి ముందు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్(ఐహెచ్‌ఎం) మాజీ ప్రిన్సిపాల్, ప్రస్తుతం పయనీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ సాక సుధాకుమార్ వివరించారు.
అతిథి దేవోభవ మన సంస్కృతిలోనే ఉంది. ఇంటికి వచ్చే బంధువుల నుంచి స్నేహితుల వరకు ఎవరికైనా చక్కని మర్యాద చేయడం కూడా మన ఆచారం. ఎంతో కొంత చెల్లించి పూటకూళ్ళమ్మ ఇంటిలో ఆహారం తీసుకోవడం, అక్కడికి దగ్గర్లో ఉండే సత్రాల్లో రాత్రికి ఉండటం ఈ రంగానికి సంబంధించిన మొదటి వాణిజ్య రూపం. అయితే ఆ ఆతిథ్య రంగం కాస్తా నేడు నక్షత్రాల హోటళ్ళ స్థాయికి చేరింది.
నిజానికి ఈ ఆతిథ్యం ఒక శాస్త్రీయమై కోర్సుగా 1893లో స్విట్జర్లాండ్‌లో ఆరంభమైంది. అది కాస్తా మన దేశానికి వచ్చేసరికి 50 సంవత్సరాలకుపైనే పట్టింది. మన దేశంలో ముంబైలోని దాదర్‌లో 1954 ఐఎల్‌ఓ సహకారంతో మొదట సర్టిఫికెట్ కోర్సుగా ఆరంభమైంది. అనంతరం డిప్లొమాగా రూపుమార్చుకుంది. తదుపరి రోజుల్లోడిగ్రీ, పీజీ కోర్సులు ఆరంభమయ్యాయి.
పాసైన విద్యార్థుల్లో 75 శాతం మంది జాబ్స్ పొందుతారు. మరో పాతిక శాతం మంది ఉన్నత చదువులను ఎంచుకుంటారు. నిజానికి ఐహెచ్‌ఎంలో సీటు పొందడమంటేనే జాబ్ వచ్చినట్లు లెక్క.
ఆసక్తి అంతకుమించి అనురక్తితో చదివితేనే ఈ రంగం అద్భుతంగా ఉంటుంది. మూడేళ్ళ కోర్సులో భాగంగా నాలుగో సెమిస్టర్‌లో స్టార్ హోటల్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడి సిబ్బంది ఇచ్చే శిక్షణ, స్ఫూర్తితో ముందుకు వెళితే మున్ముందు కెరీర్‌లో ఇక తిరుగుండదు.
జాబ్స్ విషయానికి వస్తే, హోటల్ రంగంలో ఫ్రంట్ ఆఫీస్ అంటే రూమ్ రిజర్వేషన్, గెస్ట్ చెక్‌ఇన్ - చెక్‌ఔట్, అకౌంట్స్, సేల్స్ వస్తాయి. అకౌంట్స్/ లాబీ మేనేజర్‌గా ఆపై హోటల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదుగుతారు.
ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్‌మెంట్ మరొకటి. ఇక్కడ ఆర్డర్ తీసుకోవడం నుంచి ఆహారాన్ని గెస్ట్‌కు అందించడం, టీమ్ లీడర్‌షిప్ ఉంటాయి. రెస్టారెంట్ మేనేజర్, ఎఫ్ అండ్ బి కంట్రోలర్, సేల్స్ హెడ్‌గా ఉన్నతికి అవకాశం ఉంటుంది.
కిచెన్‌లో కొమి్‌సగా స్టార్ట్ అవుతుంది. అంటే ఎంట్రీస్థాయిలో కుక్ అని అర్థం. సెక్షన్ హెడ్, సూస్ చెఫ్(సెకండ్ ఇన్ కమాండ్), ఎగ్జిక్యూటివ్ చెఫ్, ఎఫ్ అండ్ బి డైరెక్టర్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
హౌస్ కీపింగ్ ఇంకో విభాగం. హోటల్‌ను నీట్‌గా మెయింటైన్ చేయడంలో వీరిది ప్రధాన పాత్ర. ఫ్లోర్ సూపర్వైజర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ హౌస్‌కీపింగ్ చీఫ్‌గా వీరి ఉన్నతి ఉంటుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన వ్యక్తి 24 సంవత్సరాలు సర్వీ్‌సలో ఉంటే హోటల్ రంగంలో అత్యున్నత స్థానంలో ఉండే అవకాశం లభిస్తుంది.
హోటల్ రంగంలో చాలావరకు రాణించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే రిటైల్ రంగంలోకి వెళ్ళవచ్చు. ఫెసిలిటీ మేనేజర్‌గా మారవచ్చు. అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్‌లోకి వెళ్ళచ్చు.
వీరికి అస్సలు వద్దు
ఆరోగ్యం అంత బాగా లేని వారు, ఎలర్జీలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రంగంలోకి రాకూడదు.
సీరియస్ లుక్, రిజిడ్ మెంటాలిటి ఉంటే పనికిరారు.
ఛాందస భావాలు ఉన్న వ్యక్తులు ఇమడలేరు.
మాంసాహారాన్ని ఇష్టపడని వారికి కూడా ఇది అనుకూలమైన ప్రొఫెషన్ ఎంతమాత్రం కాదు.
జాతీయ పోషకాహార నిపుణురాలైన తంగం ఎలిజెబెత్ ఫిలిప్ ఆతిథ్య విద్యకు ఆద్యురాలు. అత్యున్నత స్థాయిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను తొలుత ఆమె ప్రతిపాదించారు. ఈ కోర్సు నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రంలో ఒక కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 21 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆరంభించింది. వీటన్నింటికీ అనుసంధానకర్తగా ఎన్‌సీహెచ్‌ఎంసీటి(నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్)ని 1982లో నోయిడాలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. కోర్సు ప్రమాణాలను నిలబెట్టే కృషిలో నిమగ్నమైంది. కోర్సుకు అవసరమైన సిలబస్ నుంచి పరీక్షలు, అలాగే అడ్మిషన్స్ వరకు అన్ని చర్యలను చేపట్టింది. ఇంజనీరింగ్‌కు ఐఐటి, మెడిసిన్‌కు ఎయిమ్స్ మాదిరి ప్రాధాన్యం పొందింది. అలాగే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆఫర్ చేస్తున్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌ను చేపట్టింది. టాప్ ర్యాంక్ ఉన్న హోటల్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా, కార్పొరేట్ ట్రైనీలుగా ఆరంభంలో అడుగుపెట్టేందుకు వీలు కల్పించింది.
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
అడ్మిషన్ టెస్ట్‌కు ఎన్‌టీఏ నోటిఫికేషన్
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ - 2026కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ, రాష్ట్ర అలాగే ప్రైవేటు రంగంలోని మొత్తం 80 సంస్థలు అందించే బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి ఈ టెస్టును ఉద్దేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ సంస్థ హైదరాబాద్‌లోని ఐహెచ్‌ఎంకు తోడు రాష్ట్ర స్థాయిలోని డాక్టర్ వైఎ్‌సఆర్ నిథిమ్, ఎస్‌ఐహెచ్‌ఎం, మెదక్; ఎస్‌ఐహెచ్‌ఎం, తిరుపతి; ప్రైవేటు రంగంలోని ఐహెచ్‌ఎం శ్రీశక్తి, హైదరాబాద్ కూడా ఉన్నాయి.
అర్హత: ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఇది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో ఒక్కోదానిలో 15, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 45, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్‌లో 30 మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. సమాధానం తప్పుగా గుర్తిస్తే నాలుగు మార్కులు ఇస్తారు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కట్ చేస్తారు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 25
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 25
వెబ్‌సైట్: https://exams.nta.nic.in/nchmjee/
ఇవీ చదవండి: