Share News

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:32 AM

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల పరిధిలో - సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల పరిధిలోకి వచ్చే 480 గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి దీనిని ఉద్దేశించారు.

ఇంజనీరింగ్‌   సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌
upsc logo

యూపీఎస్సీ - ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల పరిధిలో - సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల పరిధిలోకి వచ్చే 480 గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి దీనిని ఉద్దేశించారు. పోస్టును బట్టి ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

రెండు దశల్లో పరీక్షలు చివరగా పర్సనాలిటీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీలో 200 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌, 300 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్‌ పేపర్‌ ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ తరహాలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. అందులో సంబంధిత డిసిప్లిన్‌పైనే ఒక్కోటి 300 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. చివరగా 200 మార్కులకు పర్సనాలిటీటెస్ట్‌/ ఇంటర్వూ ఉంటుంది. తుది ఎంపిక మాత్రం మొత్తం 1300 మార్కులకు సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్‌ 6

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

Updated Date - Sep 21 , 2026 | 02:42 AM