Share News

భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్‌ కోర్సులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:31 AM

ఐటీ రంగంలో శీఘ్రగతిన చోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతితో ఇంజనీరింగ్‌ స్టడీ్‌సలో సరికొత్త కోర్సులు పుట్టుకువస్తున్నాయి. దరిమిలా సంప్రదాయ ఇంజనీరింగ్‌ డిసిప్లిన్స్‌కు...

భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్‌ కోర్సులు

ఐటీ రంగంలో శీఘ్రగతిన చోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతితో ఇంజనీరింగ్‌ స్టడీ్‌సలో సరికొత్త కోర్సులు పుట్టుకువస్తున్నాయి. దరిమిలా సంప్రదాయ ఇంజనీరింగ్‌ డిసిప్లిన్స్‌కు తోడు వాటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ ప్రక్రియ ఆరంభమెన నేపథ్యంలో పటిష్టమైన కెరీర్‌కు పునాదిగా ఉపయోగపడే వాటిలో ముఖ్యంగా..

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌: సిస్టమ్స్‌ ఆటోమేషన్‌, ప్రిడిక్షన్‌, డేటా అనాల్సిస్‌ కోసం ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి ఇందులో భాగం. డీప్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌(ఎన్‌ఎల్‌పీ) దీనిలో ప్రధాన ఏరియాలు. ఏఐ ఇంజనీర్‌, మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌ వంటి ఉద్యోగాలు ఈ కోర్సులు చదివినవారికి లభిస్తాయి. దీనిలో బీటెక్‌ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ఏదైనా ఒకటి స్పెషలైజేషన్‌గా పీజీ కూడా చేయవచ్చు.

బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌: హెల్త్‌ కేర్‌, ఇంజనీరింగ్‌ రంగాలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. మెడికల్‌ పరికరాలు, కృత్రిమ అవయవాలు, రోగనిర్ధారణ వ్యవస్థలకు తోడు స్మార్ట్‌ డివైజెస్‌ అంటే సర్జికల్‌ రోబోట్స్‌ రూపకల్పనలో ఈ విభాగం కీలకం. బయోమెడికల్‌ ఇంజనీర్‌గా ఉపాధి పొందవచ్చు. ఇంజనీరింగ్‌లో ఇదో యూనిక్‌ స్పెషలైజేషన్‌.

రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌: మాన్యుఫాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌ వంటి రంగాలకు అటానమస్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధిపర్చడం దీనిలోని ప్రత్యేకత. ఏఐ ఇంటిగ్రేషన్‌, మెకానిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, సెన్సార్‌ టెక్నాలజీస్‌పై దృష్టిసారిస్తుంది. ఈ కోర్సు చేసిన వారికి రోబోటిక్స్‌ ఇంజనీర్‌, ఆటోమేషన్‌ ఎక్స్‌పర్ట్‌, మెకట్రానిక్స్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు లభిస్తాయి. దీనిలో బీటెక్‌కు తోడు పీజీలో స్పెషలైజేషన్‌గానూ చేయవచ్చు.

సైబర్‌ సెక్యూరిటీ ఇంజనీరింగ్‌: సైబర్‌ ముప్పు నుంచి డిజిటల్‌ మౌలిక సదుపాయాల పరిరక్షణ ఇందులో కీలకం. నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌, క్రిప్టోగ్రఫీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు ఇందులోకి వస్తాయి. సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, ఎథికల్‌ హ్యాకర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. దీనిలోనూ ప్రత్యేకించి బీటెక్‌ ప్రోగ్రామ్‌ ఉంది. పీజీలో స్పెషలైజేషన్‌గానూ చేయవచ్చు.

క్వాంటమ్‌ ఇంజనీరింగ్‌: క్వాంటమ్‌ కంప్యూటర్లు, సెన్సర్ల అభివృద్ధి ఉంటుంది. అలాగే క్వాంటమ్‌ ఫిజిక్స్‌ సూత్రాలను ఆధారంగా చేసుకుని కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ కోర్సు చేసిన వారికి క్వాంటమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, రీసెర్చ్‌ సైంటిస్ట్‌, క్వాంటమ్‌ అల్గోరిథమ్‌ డెవలపర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ డిసిప్లిన్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను పలు వర్సిటీలు అందిస్తున్నాయి.

రెన్యువబుల్‌/ సస్టయినబుల్‌ ఎనర్జీ ఇంజనీరింగ్‌: సోలార్‌, విండ్‌కు తోడు ఇతర పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించిన టెక్నాలజీల డెవల్‌పమెంట్‌ ఈ డిసిప్లిన్‌లో ఉంటుంది. స్మార్ట్‌ గ్రిడ్స్‌, ఎనర్జీ స్టోరేజీ, గ్రీన్‌ బిల్డింగ్‌ డిజైన్‌ తదితరాలు అధ్యయనంలో భాగం. రెన్యువబుల్‌ ఎనర్జీ ఇంజనీర్‌, సస్టయినబిలిటీ అనలిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌గా ఉపాధి పొందవచ్చు. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఒక విస్తృత విభాగంగా ఇది ఎక్కువగా ఉంటుంది.


ఈ రంగాల్లో దూసుకుపోయేందుకు యూనివర్సిటీలు/ ఇన్‌స్టిట్యూషన్స్‌ అందించే డిగ్రీ కోర్సులు లేదంటే ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ల్లో చేరి ముందుకు సాగవచ్చు. సంబంధిత నైపుణ్యాలను అలవర్చుకోవచ్చు.

  • చాలా వర్సిటీలు వీటిలో యూజీ, పీజీ ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఉదాహరణకు టాండన్‌లోని ఎన్‌వైయూ వీటిలో ఫ్లెక్సిబుల్‌గా ఉండే రీతిలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రధానంగా ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టితో కరికులమ్‌ను కస్టమైజ్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

  • ఆన్‌లైన్‌ కోర్సులు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. జనరేటివ్‌ ఏఐలో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్స్‌ అలాగే డేటా సైన్స్‌, ఏఐ, తదితరాల్లో కెరీర్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్స్‌ కూడా ఉన్నాయి.

  • ప్రోగ్రామ్‌ను ఎంచుకోవడంలోనే మన తెలివితేటలు ఇతోధిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా విద్యార్థి తన అకడమిక్‌ స్థాయి, కెరీర్‌ గోల్స్‌, ఎంచుకునే లెర్నింగ్‌ స్టయిల్‌(ఆ్‌ఫలైన్‌/ ఆన్‌లైన్‌)ను అనుసరించి సరైన కోర్సును ఎంపిక చేసుకోవాలి.

  • ఇంటర్‌ తదితర కోర్సులను చేస్తున్న లేదా పూర్తయిన విద్యార్థులు తమ ఆసక్తులను అనుసరించి బీఈ/ బీటెక్‌లో వీటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ఉన్న విద్యార్థులు తదుపరి స్థాయిలో తమ లక్ష్యానికి అనువైన పీజీ/ ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం మంచిది. అలా జాబ్‌కు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటే మంచిది.


ఐఐటీ, ఎన్‌ఐటీల్లో

వీటిలో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆరంభమైంది. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వీటిలో కొన్ని సంస్థలు బీటెక్‌లో సరికొత్త కోర్సులను ఈ ఏడాది నుంచి ఆరంభించాయి.

  • ఐఐఎస్సీ, బెంగళూరు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, మెకానిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌.

  • ఐఐటీ, ఇండోర్‌: ఎన్విరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సస్టయినబుల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌.

  • ఎన్‌ఐటీ, రూర్కెలా: మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌

  • ఎన్‌ఐటీ, ఢిల్లీ: వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌, బీటెక్‌ ఇన్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌

  • ఎన్‌ఐటీ, పాట్నా: ఏఐ అండ్‌ డేటా సైన్స్‌

  • ఎన్‌ఐటీ, కాలికట్‌: ఎనర్జీ ఇంజనీరింగ్‌

  • ఎన్‌ఐటీ, కురుక్షేత్ర: ఏఐ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌

  • ఎన్‌ఐటీ సూరత్‌కల్‌: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

  • ఎన్‌ఐటీ, వరంగల్‌: డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ

  • ఈ కోర్సులన్నీ సరికొత్త కెరీర్‌ మార్గాల ఎంపికకు వీలు కల్పిస్తాయి. భారత దేశానికి చెందిన సెమికండక్టర్‌ మిషన్‌లో బాగంగా ఏర్పడే ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు సీఎ్‌సఈలో కటాఫ్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి స్కోర్‌తో మాత్రమే సీటు లభిస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇందులో కొద్దిగా తక్కువ కటా్‌ఫకే సీటు లభించే అవకాశాలు ఎక్కువ.

ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావు

డైరెక్టర్‌, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 06:31 AM