జాబ్ కార్నర్ ఎన్‌టీపీసీ సీసీఎంబీ ఇండియన్ నేవీలో ఐటీ ఆఫీసర్
ABN , Publish Date - May 18 , 2026 | 04:53 AM
ఎన్‌టీపీసీ లిమిటెడ్ 25 ఇంజనీర్ (కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్స్) పోస్టులను భర్తీ చేయనుంది....
ఎన్‌టీపీసీ
ఎన్‌టీపీసీ లిమిటెడ్ 25 ఇంజనీర్ (కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్స్) పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్/ మెకానికల్/ కంట్రోల్ - ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్ పాసై ఉండాలి. నాలుగేళ్ళ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 25
మరో నోటిఫికేషన్
ఇరవై అసిస్టెంట్ ఆఫీసర్(ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్)కు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంట్‌లో డిగ్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 22
వెబ్‌సైట్: careers.ntpc.co.in
సీసీఎంబీ
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నీషియన్ 23, డ్రైవర్ 1
అర్హతలు: టెన్త్‌కు తోడు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. డ్రైవర్ పోస్టుకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌కుతోడు అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ: మే 26
వెబ్‌సైట్: https://www.ccmb.res.in
ఇండియన్ నేవీలో ఐటీ ఆఫీసర్
కేరళం - ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ - షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ) కింద 15(తాత్కాలికం) ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: టెన్త్/ ఇంటర్ ఇంగ్లీ్‌షలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ)కి తోడు ఎంసీఏ చేసి ఉండాలి. బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఉత్తీర్ణత లేదా ఆఖరు ఏడాది చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక: విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక జరుపుతారు.
చివరి తేదీ: మే 16 నుంచి జూన్ 1లోగా
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
ఈ వార్తలు కూడా చదవండి
త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు