నీట్‌కు మరోసారి సదవకాశంగా మలుచుకుంటే సత్ఫలితం
ABN , Publish Date - May 18 , 2026 | 05:01 AM
నీట్ రద్దయింది. ఆశావహులపై నీళ్ళుజల్లింది. 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్రమైన నిరాశ, ఆందోళన, ఆగ్రహం కలిగించింది. అయితే ఈ సంక్షోభాన్ని...
నీట్ రద్దయింది. ఆశావహులపై నీళ్ళుజల్లింది. 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్రమైన నిరాశ, ఆందోళన, ఆగ్రహం కలిగించింది. అయితే ఈ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొదట మొన్నటి నీట్‌ని ప్రీఫైనల్ అనుకుంటే సగం భారం తగ్గుతుంది. అంతేకాదు, ఇప్పుడు
కలిగిన కష్టాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నీట్‌కు హాజరైన అందరికీ కలిగిన కష్టం అనుకుంటే అందోళన చాలా వరకు తగ్గుతుంది. ఏం చేయాలన్నది స్ఫురిస్తుంది. నిజానికి ఈ సమయాన్ని స్కోర్ పెంచుకునేందుకు ఉపయోగపడే గోల్డెన్ పీరియడ్‌గా భావించి కసరత్తు ఆరంభించాలి. జూన్ 21న తిరిగి నీట్ నిర్వహించనున్నారు. నెల రోజులకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో...
ఈ ఏడాదికి తోడు గడచిన రెండేళ్ళలో జరిగిన నీట్‌ని విశ్లేషించుకుంటే. ముఖ్యమైనవిగా...
బోటనీలో జెననెటిక్స్ అండ్ ఎవల్యూషన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్, ఎకాలజీ, సెల్ బయాలజీ వంటి చాప్టర్స్
జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ, రిప్రొడక్షన్, హెల్త్ అండ్ డిసీజ్, బయోమాలిక్యూల్స్ వంటి చాప్టర్స్
ఫిజిక్స్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్,
ఆప్టిక్స్, వేవ్స్, మేగ్నటిజమ్ అండ్ ఈఎంఐ
కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, జీఓసీ, హైడ్రోకార్బన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అల్డిహైడ్స్, కీటోన్స్, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఈ సమయంలో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ రివిజన్‌పైనే ఫోకస్ పెట్టాలి బయాలజీలో సినానిమ్ టెర్మ్స్, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీలో ముఖ్యమైన ఫార్ములాలు, రియాక్షన్స్‌ని రివైజ్ చేసుకోవాలి.
రోజుకు కనీసం ఒక పూర్తి స్థాయి మాక్ టెస్ట్ రాయాలి. ఎర్రర్ నోట్ బుక్ కూడా మెయింటైన్ చేయాలి. మీరు చేస్తున్న తప్పు కాన్సెప్ట్ పరంగానా, కాలిక్యులేషన్ కారణంగానా అన్నది తెలిస్తే సరిదిద్దుకునేందుకు వీలవుతుంది.
ఈ ఏడాది నీట్ పేపర్‌లో కాలిక్యులేషన్స్ కొంత లెంథీగా ఉన్నాయి. విద్యార్థులను అవి ఇబ్బంది పెట్టాయి. అందుకని ప్రాక్టీసింగ్ సమయంలోనే కాలిక్యులేషన్స్ విషయంలో వేగాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
కొత్తగా లేదా మీరు అంత స్ట్రాంగ్‌గా లేని చాప్టర్ల జోలికి ఇప్పుడు పోవద్దు. హై వెయిటేజ్ అలాగే మీరు కాన్ఫిడెంట్ అనుకున్న చాప్టర్లను మాత్రమే ఎక్కువగా రివైజ్ చేయాలి.
కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ కొంత ఈజీగా ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే త్వరలో జరగబోయే రీ-నీట్ కొద్దిగా కఠినంగా ఉండవచ్చు. ప్రమాణాలను పెంచే యత్నం చేయవచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి.
ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నపత్రాలను తప్పక రివైజ్ చేయండి. స్టేట్‌మెంట్, అసెర్షన్ - రీజనింగ్, మేచింగ్ టైప్ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టుల్లో గెస్ వర్క్‌కు అవకాశం ఇవ్వకూడదు.
సోషల్ మీడియా అదేవిధంగా రూమర్లకు దూరంగా ఉండాలి. కొద్ది రోజుల క్రితం రాసిన నీట్ రద్దయింది. అందుకే దీనిని ఫ్రెష్‌గా ఆలోచించాలి.
ఈ పరీక్ష రద్దుతో విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా విపరీతమైన మానసిక ఆందోళనకు గురయ్యారన్నది వాస్తవం. రెండేళ్ళ శ్రమ వృథా అయిందన్న ఆవేదన తప్పక ఉంటుంది. అయితే కుటుంబం అంతా ఎమోషనల్ సపోర్ట్ కలిగి ఉండాలి. మీ తప్పేమీ లేదు. అందుకని అతిగా ఎవ్వరూ ఆలోచించవద్దు.
సరైన నిద్ర, పౌష్ఠికాహారం, పాజిటివ్ థింకింగ్‌తో ఈ గడువును ఇట్టే అధిగమించాలి. విజయాన్ని అందుకోవడమే ఇప్పుడు మీ లక్ష్యం కావాలి.
డాక్టర్ పవన్ కుమార్ కాసు
ఎక్స్‌లెన్సియా, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి
త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు