జాబ్ కార్నర్ 21-09-2026
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:57 AM
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్),యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ),పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) లాంటి సంస్థల్లో ఉద్యోొగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆర్‌ఎఫ్‌సీఎల్
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)- రామగుండం, నోయిడాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాన్స్‌పోర్టేషన్, హ్యూమన్ రిసోర్సెస్, మెడికల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఐటీ
పోస్టులు: ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సెక్రటేరియల్ ఆఫీసర్, అడిషనల్ సీఎంఓ, సీఓంఓ, అకౌంట్స్ అఫీసర్, చీఫ్ మేనేజర్
అర్హత: పోస్టుకు అనుగుణంగా బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, ఎంబీబీఎస్, సీఏ/సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతకు తోడు అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 24(హార్డ్ కాపీలను అక్టోబర్ 1 లోగా పంపుకోవాలి)
వెబ్‌సైట్: https://www.rfcl.co.in
యూఐఐసీ
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ)- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జనరలిస్ట్-200, హిందీ ఆఫీసర్స్ 25)
అర్హత: నిర్దేశిత సబ్జెక్టులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతకు తోడు ఉద్యోగ అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్(ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రప్టివ్), ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 28
వెబ్‌సైట్: https://uiic.co.in
పీఎఫ్ఆర్‌డీఏ
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) 30 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: జనరల్, రీసెర్చ్, యాక్చువరీ, రాజభాష
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీకి తోడు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక: రెండు దశల్లో ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 24
వెబ్‌సైట్: www.pfrda.org.in.