ఎర్రమల్లె
ABN , Publish Date - May 18 , 2026 | 05:51 AM
మల్లి మల్లి మల్లెపువ్వోలే మా ఎర్రమల్లె మల్లి ముద్దుగ మొగ్గ తొడగాలే మల్లి మల్లి మల్లెతీగోలే...
మల్లి మల్లి మల్లెపువ్వోలే మా ఎర్రమల్లె
మల్లి ముద్దుగ మొగ్గ తొడగాలే
మల్లి మల్లి మల్లెతీగోలే మా ఎర్రమల్లె
మల్లి ముద్ద పందిరవ్వాలే –
నిశీధి తోటల్లో నిదురించే కన్నుల్లో
ఒక రెమ్మ మమ్ము తాకిందే మా ఎర్రమల్లె
తాకిన ఆ రెమ్మ అమ్మ ఒడిలా పరచుకుంటే
మా కల పసిపాప అయిందే మా ఎర్రమల్లె –
చిక్కని చీడల్లో చెదిరిన నీడల్లో
పూలెన్నోరాలిపోయాయే మా ఎర్రమల్లె
రాలిన ఆ పూలు నీ గుర్తులవుతుంటే
మా గుండెలు మబ్బులయ్యాయే మా ఎర్రమల్లె –
నిస్సార లోతుల్లో నిశ్శబ్ద జీవుల్లో
భూచెక్కిలి నెర్రబారిందే మా ఎర్రమల్లె
నేల నెర్రబారుల్లో నల్లగాలి నడవంగా
మట్టి పువ్వై పరిమళించి మా ఎర్రమల్లె –
వాడిన వనంలో ఓడిన జనంలో
నీ ఊహ ఊపిరవ్వాలే మా ఎర్రమల్లె
ఊపిరి పరాగమై పూత పట్టి కూత వేస్తే
వనం పూల జనం అవుతుందే మా ఎర్రమల్లె
లెల్లే సురేష్
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు