రేపు వేములవాడలో రంగవల్లి స్మారకోపన్యాసం
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:45 AM
రంగవల్లి తన నిండు జీవితాన్ని ప్రజలకర్పించిన తర్వాత ఆమె త్యాగమయ విప్లవ జీవితం ప్రజలకు మరింతగా సుపరిచితమయింది. రంగవల్లి స్మృతిలో వేములవాడ నంది కమాన్ వద్ద నిర్మాణమైన విజ్ఞాన కేంద్రం....
రంగవల్లి తన నిండు జీవితాన్ని ప్రజలకర్పించిన తర్వాత ఆమె త్యాగమయ విప్లవ జీవితం ప్రజలకు మరింతగా సుపరిచితమయింది. రంగవల్లి స్మృతిలో వేములవాడ నంది కమాన్ వద్ద నిర్మాణమైన విజ్ఞాన కేంద్రం.. అభ్యుదయ శాస్త్రీయ భావాలను పంచుతోంది. ఇదొక సామాజిక, సాంస్కృతిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతోంది. వైద్య విద్యతో పాటు ఉన్నత విద్యావ్యవస్థ అవినీతి, పరీక్ష లీకులు అధిక ఫీజులతో భ్రష్టు పట్టిపోతున్నది. ఈ సమయంలో విద్యారంగ ప్రజాస్వామీకరణకై జెన్–జీ ఉద్యమిస్తున్నది. రంగవల్లి 27వ వర్ధంతి సందర్భంగా వర్తమాన సమస్యలపై ‘జెన్ జీ ఉద్యమ ఆకాంక్షలు’, ‘విద్యారంగ ప్రజాస్వామీకరణ’ అంశాలపై ప్రొఫెసర్ గూడూరు మనోజ, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావులచే స్మారకోపన్యాసాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ప్రశ్నించే ప్రతి మనిషిని దేశద్రోహిగా చిత్రిస్తూ, మనిషికీ మనిషికీ మధ్య ఇనుప గోడలు నిర్మిస్తున్న సమయంలో, ఆ గోడల్ని కూల్చి ప్రశ్నను సామూహిక ప్రతిఘటనగా మార్చుతున్న జెన్ జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. అబద్ధాలను సత్యాలుగా, సత్యాలను అబద్ధాలుగా చిత్రిస్తూ ఏ సామాజిక మాధ్యమాల ద్వారా పాలకులు ప్రజల మెదళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారో, ఆ సామాజిక మాధ్యమాలనే అస్త్రంగా చేసుకొని యువత ఉద్యమిస్తున్నారు. వారిప్పుడు తమ రోజువారి సమస్యల నుంచి ఓట్ చోరీ సమస్య దాకా వచ్చి ప్రజల హక్కుల పోరాటాన్ని చాటుతున్నారు. ఫలితంగా తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకనాడు రంగవల్లి తరం నక్సల్బరి–శ్రీకాకుళ ఉద్యమ వెల్లువ నుంచి ప్రేరణ పొందిన జెన్–జీ తరమే. యువత భావాలను వినడం అంటే వారి భవిష్యత్తును వినడమే. ఈ పనిలో రంగవల్లి విజ్ఞాన కేంద్రం తన బాధ్యత నిర్వహిస్తుంది. వేములవాడలోని రంగవల్లి విజ్ఞాన కేంద్రం రెండవ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 11న ఉదయం 10:00 గంటల నుంచి జరిగే రంగవల్లి స్మారకోపన్యాస కార్యక్రమం జరగనున్నది.
అరుణోదయ విమలక్క
రంగవల్లి విజ్ఞాన కేంద్రం అధ్యక్షురాలు
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్