ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 06 2026
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:01 AM
‘లంద’ నవల ఆవిష్కరణ, సాహిత్య సమాలోచన సదస్సు, కవి సంధ్య పొయిట్రీ వర్క్ షాప్, ఇంగ్లీష్ ఫిక్షన్ ఆఫ్ ద యియర్ అవార్డు...
‘లంద’ నవల ఆవిష్కరణ, సాహిత్య సమాలోచన సదస్సు, కవి సంధ్య పొయిట్రీ వర్క్ షాప్, ఇంగ్లీష్ ఫిక్షన్ ఆఫ్ ద యియర్ అవార్డు
పొన్నాల బాలయ్య నవల ‘లంద’ ఆవిష్కరణ సభ జూన్ 14 మధ్యాహ్నం 1.30 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్ష్యత కె. రంగాచార్య, ముఖ్య అతిథి నందిని సిధారెడ్డి, ఆవిష్కర్త కాశీం, విశిష్ట అతిథి దేశపతి శ్రీనివాస్, ప్రధాన వక్త జి. లక్ష్మీనరసయ్య, ఆత్మీయ అతిథులు జూపాక సుభద్ర, పసునూరి రవీందర్, ఆత్మీయ సందేశాలు పర్‌స్పెక్టివ్స్ ఆర్కే, తైదల అంజయ్య, ఆహ్వానం బెల్లంకొండ సంపత్ కుమార్.
మంజీరా రచయితల సంఘం
సాహిత్య సమాలోచన సదస్సు
మేరెడ్డి యాదగిరి రెడ్డి యాభై ఏళ్ల సాహిత్య జీవితం – సమాలోచన సదస్సు నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్‌లో జూన్ 13 ఉదయం 10 గంటల నుండి ఉంటుంది. సభలో నామోజు బాలాచారి, ఏనుగు నరసింహా రెడ్డి, శీలం భద్రయ్య, పొట్టబత్తుల రామకృష్ణ, ఉప్పల పద్మ, సి. అనిత కుమారి ప్రసంగిస్తారు. నాళేశ్వరం శంకరం, బెల్లి యాదయ్య, తండు కృష్ణ కౌండిన్య, మునాసు వెంకట్ పురుషోత్తమాచార్య, బైరెడ్డి కృష్ణారెడ్డి, సాగర్ల సత్తయ్య, పెరుమాళ్ళ ఆనంద్ పాల్గొంటారు.
సృజన సాహితి
కవి సంధ్య పొయిట్రీ వర్క్ షాప్
కవి సంధ్య – డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ, యానాం సంయుక్త నిర్వహణలో జూన్ 13, 14 తేదీల్లో కవిత్వ శిక్షణా శిబిరం జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌లో ఆర్. సీతారాం, నామాడి శ్రీధర్, శిఖామణి, చల్లపల్లి స్వరూపరాణి, బొల్లోజు బాబా, దాట్ల దేవదానం రాజు, వరుగు భాస్కర్ రెడ్డి, మధునాపంతుల, అద్దేపల్లి ప్రభు తదితరులు వివిధ కవిత్వ అంశాలపై ప్రసంగిస్తారు.
కవి సంధ్య
ఇంగ్లీష్ ఫిక్షన్ ఆఫ్ ద యియర్ అవార్డు
‘బుక్ బ్రహ్మ – బుక్‌వర్మ్ ఇంగ్లీష్ ఫిక్షన్ ఆఫ్ ద యియర్’ అవార్డు కోసం దక్షిణ భారత భాషల నుంచి ఇంగ్లీష్‌కు అనువాదమై 2023–2025 మధ్య పబ్లిష్ ఐన నవలల్ని ఆహ్వానిస్తున్నాం. రూ.1లక్ష అవార్డును మూల రచయిత, అనువాదకుడు సమంగా పంచుకుంటారు. ప్రచురణకర్తలు, రచయితలు, అనువాదకులు అర్హత గల తమ పుస్తకాలు 3 కాపీలను జూన్ 30లోపు చిరు నామా: బుక్ బ్రహ్మ ఫౌండేషన్, థర్డ్ ఫ్లోర్, ఆర్‌కె కాంప్లెక్స్, కెఎస్‌ఎస్‌ఐడిసి కాంపౌండ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేస్ 1, బెంగళూరు 560100కు పంపాలి.
బుక్ బ్రహ్మ ఫౌండేషన్
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News