Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 30-08-2026

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:15 AM

అద్దేపల్లిపై సాహిత్యావలోకనం, ఆరుద్ర జయంతి సభ, యువ కవితలకు ఆహ్వానం, ‘జెన్ జీ’ ఉద్యమ కవితలు, ‘సెల్ఫీ’ కథల సంపుటి, ‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 30-08-2026

అద్దేపల్లిపై సాహిత్యావలోకనం

అద్దేపల్లి రామమోహన రావు సమగ్ర సాహిత్యంపై యువ అవలోకనం కార్యక్రమం సెప్టెంబర్ 6 ఉ.10గం.ల నుంచి కాకినాడ మేవా ఫంక్షన్ హాలులో జరుగుతుంది. సభలో సిద్ధార్థ, అరసవిల్లి కృష్ణ, గాజోజు నాగభూషణం, పాయల మురళీ కృష్ణ, పుప్పాల శ్రీరాం, సుంకర గోపాలయ్య తదితరులు మాట్లాడుతారు. అద్దేపల్లి ‘ఆధునిక కవిత్వ విమర్శ–పరిణామ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణ ఉంటుంది.

అద్దేపల్లి ఫౌండేషన్

ఆరుద్ర జయంతి సభ

ఆరుద్ర శత జయంతి సభ ఆగస్టు 31న నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కాలేజీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ‘నూరు శరత్తులు’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఉంటుంది. ఆవిష్కర్త కాళిదాసు పురుషోత్తం; సభాధ్యక్షులు గిరి; అతిథులు చెంచయ్య, కె. కరుణశ్రీ, హెచ్‌ఎస్‌వికె రంగారావు.

ఈతకోట సుబ్బారావు

యువ కవితలకు ఆహ్వానం

‘యువ కవిత’ పేరుతో 35 ఏళ్ళ వయసు లోపు కవుల కవిత్వంతో తేనున్న సంకలనానికి సెప్టెంబర్ 10 లోగా కుల సమస్య, జెండర్, మత వివక్ష, జెన్ జీ కోణం, భవిష్యత్ భారతం, సెక్యులరిజం తదితర అంశాలపై కవితలను ఈమెయిల్‌: skybaaba99@gmail.comకు పంపాలి. పత్రికలలో, సోషల్ మీడియాలో వచ్చినా సంకలనాల్లో రాని కవితలు మాత్రమే పంపండి.

దోస్త్ పబ్లికేషన్స్

‘జెన్ జీ’ ఉద్యమ కవితలు

‘జెన్ జీ’ ఉద్యమ నేపథ్యంలో యువతకు సాలిడారిటీగా సోషల్‌ మీడియాలో వచ్చిన కవితలను సేకరించి ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ తరఫున కవితా సంకలనం ప్రచురిస్తున్నాం. దయ చేసి మీ కవితలను సెప్టెంబర్ 20లోపు 88019 10908, 63003 28040 వాట్సప్ నంబర్లకు పంపాలి. పోటీ నిబంధనలను పై నంబర్లకు మెసేజ్‌ చేసి తెలుసుకోగలరు.

విజయ భండారు

‘సెల్ఫీ’ కథల సంపుటి

సారంగ వడ్డెపల్లి కథల సంపుటి ‘సెల్ఫీ’ ఆవిష్కరణ సెప్టెంబరు 6 ఉ.10 గం.లకు ట్వింకిల్‌ స్టార్ క్యాంపస్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా, మహబూబాబాద్‌లో జరుగుతుంది. సభలో శిరంశెట్టి కాంతారావు, కొండి మల్లారెడ్డి, పర్కపెల్లి యాదగిరి పాల్గొంటారు.

ధరిత్రి సాహితీ మిత్రుల సంగమం

‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’

వుడుత చంద్రశేఖర్ రాసిన ‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’ పుస్తకం ఆవిష్కరణ సెప్టెంబర్ 3 సా.5 గం.లకు కరీంనగర్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త దారం రఘురామన్, అతిథి మేకా విజయమోహన్ రెడ్డి. సభలో వారాల ఆనంద్, గండ్ర లక్ష్మణరావు, మాడిశెట్టి గోపాల్, స్వామి తదితరులు పాల్గొంటారు.

కె.ఎస్. అనంతాచార్య

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని

Updated Date - Aug 31 , 2026 | 01:15 AM