Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2 03 2026

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:35 AM

‘మహిమాలయం’ ఆవిష్కరణ, ‘సాహిత్యతులాభారం’, నాగభైరవ పురస్కారం, ‘కవి సంధ్య – కవి సుధామ’ కవితల పోటీ ఫలితాలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2 03 2026

‘మహిమాలయం’ ఆవిష్కరణ,

పూనాటి రవీంద్రబాబు రచన ‘మహిమాలయం’ ఆవిష్కరణ మార్చి 7 సా.4గంటల నుంచి పెన్షనర్స్‌ హాల్‌, 6వ లేన్‌, బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుం ది. రఘుబాబు (సినీ నటుడు), గంటేడ గౌరునాయుడు, భూసురపల్లి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి నవీన్‌, భాస్కరభట్ల, చందనపల్లి గోపాలరావు, పక్కి రవీంద్ర నాథ్‌ తదితరులు పాల్గొంటారు.

గన్నవరపు ముత్యం

‘సాహిత్యతులాభారం’

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాగంటి తులసి సాహిత్య సమాలోచన సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మార్చి 8న ఉ.6గంటల నుంచి విజయనగరంలో ఆమె ఇంట్లో జరుగుతుంది. ఆమె రచనలను అభిమానించే సాహితీ మిత్రులు ఏ రచన గురించైనా మాట్లాడవచ్చు. ఆసక్తి కలిగినవారు 83094 68318 నంబర్‌కు ఫోన్‌ చేసి పేరు నమోదు చేసుకోవాలి.

పాయల మురళీకృష్ణ

నాగభైరవ పురస్కారం

నాగభైరవ సాహిత్య పురస్కారానికి బాల సాహిత్య కథా సంపుటాలను, గేయ సంపుటాలను, నవలలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ బహుమతులు వరుసగా రూ.10వేలు, రూ.5వేలు. 2020–2025 మధ్య ప్రచురించిన పుస్తకాలు నాలుగు ప్రతులను మార్చి 31 లోపు చిరునామా: నాగభైరవ ఆదినారాయణ, 202 – శ్రీవెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైన్‌, రామయ్యనగర్‌, ఒంగోలు – 523002, ప్రకాశం జిల్లా, ఏపీకి పంపాలి. వివరాలకు: 98497 99711.

నాగభైరవ ఆదినారాయణ

‘కవి సంధ్య – కవి సుధామ’ కవితల పోటీ ఫలితాలు

ఈ పోటీలో మొదటి, రెండవ, మూడవ బహుమతులకు వరుసగా లేదాళ్ల రాజేశ్వరరావు, పొనుగుమట్ల అశోక్ కుమార్, ఎన్. లహరి కవితలు ఎంపికయ్యాయి. కన్సోలేషన్ బహుమతులకు: పిన్నంశెట్టి కిషన్, బండారి రాజ్‌కుమార్, దోమల యాకస్వామి, ఇంద్రగంటి మధుసూదనరావు, మిరప మహేష్ ఎంపికయ్యారు. మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జరిగే సభలో బహుమతి ప్రదానం ఉంటుంది. వివరాలకు: 94401 05987.

దాట్ల దేవదానం రాజు

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 05:35 AM