Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 05 2026

ABN , Publish Date - May 18 , 2026 | 05:45 AM

‘కథా ఖమ్మం’ పురస్కారానికి ఆహ్వానం, ఎస్‌జి ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం, ‘కటకటా మర్కటా’ బాలల కథల సంపుటి, ‘జీవజలం చలం’ స్మారకోపన్యాసం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 05 2026

‘కథా ఖమ్మం’ పురస్కారానికి ఆహ్వానం

‘కథా ఖమ్మం’ తెలంగాణ పురస్కారం పేరిట తెలంగాణ రచయితల కథా సంపుటికి ప్రతి ఏటా రూ.25వేల నగదు బహుమతితో ఉత్తమ కథాసంపుటి అవార్డు ఇవ్వనున్నాం. కథాఖమ్మం – 2026 పురస్కారానికిగాను గత రెండేళ్ళలో (సెప్టెంబర్ 2024 – ఆగష్టు 2026 నడుమ) ప్రచురితమైన సంపుటాలు 5 ప్రతులను ఆగష్టు 31లోపు చిరునామా: ధరణికోట రమేష్ కుమార్, వేదిక ఫంక్షన్ హాల్, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం కు పంపాలి.

ఖమ్మం స్ఫూర్తి

ఎస్‌జి ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం

ఎస్‌జి ఫౌండేషన్ ప్రతి ఏటా కథా, కవితా పురస్కారాలు ఇవ్వడానికి సంకల్పించింది. 2025 కథా పురస్కారానికి పెద్దింటి అశోక్ కుమార్, కవితా పురస్కారానికి బండ్ల మాధవరావు ఎంపికయ్యారు. రూ.10వేల నగదు, మెమొంటోతో సత్కార సభ మే 23 మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

పి. శ్రీనివాస్ గౌడ్

‘కటకటా మర్కటా’ బాలల కథల సంపుటి

సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రామకృష్ణ మిషన్ సౌజన్యంతో ఆర్.సి. కృష్ణస్వామి రాజు బాలల కథల సంపుటి ‘కటకటా మర్కటా’ ఆవిష్కరణ సభ మే 18 సా.5:30గం.లకు తిరుపతిలోని రామకృష్ణ మిషన్ వివేకానంద సభాంగణంలో జరగనుంది. సభలో సుకృతానంద మహారాజ్, ఎన్. సత్యనారాయణ రాజు, మధురాంతకం నరేంద్ర, గంగిశెట్టి శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు. వివరాలకు: 7396447960.

సంస్కార్‌ రాజేష్‌

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

‘జీవజలం చలం’ స్మారకోపన్యాసం

గుడిపాటి వెంకటాచలం స్మారకోపన్యాస సభ ‘జీవజలం చలం’ మే 19 సా.6గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘చలం పౌరాణిక సాహిత్య – వస్తు రూ పాలు’ అంశంపై ఎన్‌. వేణుగోపాల్‌, కుప్పిలి పద్మ ప్రసంగిస్తారు. ఆప్తవాక్యం ఏనుగు నరసింహారెడ్డి. చలం పౌరాణిక రచనల్లోని కొన్ని భాగాలను భండారు విజయ, జ్వలిత, అరుణ ధూళిపాల, ఐనంపూడి శ్రీలక్ష్మి, గడ్డం సులోచన వినిపిస్తా రు. వివరాలకు: 9440451960.

నాళేశ్వరం శంకరం

Updated Date - May 18 , 2026 | 05:45 AM