Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 6 04 2026

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:26 AM

‘ఏడుకోలల బాయి’ పద్యగానం, జయమిత్ర పురస్కారం, వి.చంద్రశేఖరరావు పురస్కార ప్రదానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 6 04 2026

‘ఏడుకోలల బాయి’ పద్యగానం

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన రచన ‘ఏడుకోలల బాయి’ ఎన్నికల శతకం పరిచయంతో పాటు పద్యగానం ఏప్రిల్ సాయంత్రం 6 గంటలకు నల్లగొండలోని యుటిఎఫ్‌ భవన్‌లో జరుగుతుంది. ముడుంబై పురుషోత్తమాచార్య, తండు కృష్ణకౌండిన్య, పెరుమాళ్ళ ఆనంద్, సాగర్ల సత్తయ్య, ఇడికోజు శ్రీనివాసా చారి, సి. అనిత కుమారి పాల్గొంటారు.

సృజన సాహితి

జయమిత్ర పురస్కారం

జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు జి. చెన్నకేశవరెడ్డి 82వ జన్మదినం సందర్భంగా ఎం.కె. రాముకు పురస్కార ప్రదానం ఏప్రిల్‌ 7 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షులు అమ్మంగి వేణుగోపాల్‌; సభా ప్రారంభకులు ఏనుగు నరసింహారెడ్డి; ముఖ్యఅతిథి కొలకలూరి ఇనాక్‌; విశిష్ట అతిథులు టి.గౌరీశంకర్‌, నాళేశ్వరం శంకరం.

అప్పం పాండయ్య

వి.చంద్రశేఖరరావు పురస్కార ప్రదానం

వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం 2026ను శ్రీఊహకు ప్రదానం చేసే కార్యక్రమం ఏప్రిల్ 12 సాయంత్రం 5.30నిమిషాలకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. ప్రదానకర్త వి. ప్రసూన, అధ్యక్షత కాట్రగడ్డ దయానంద్, ముఖ్యఅతిథి పి. సత్యవతి, వక్తలుగా బి. తిరుపతిరావు, మహమ్మద్ ఖదీర్ బాబు, వాసిరెడ్డి నవీన్.

వి. ప్రసూన

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్.

Updated Date - Apr 06 , 2026 | 03:27 AM