ఈ వారం వివిధ కార్యక్రమాలు 4 05 2026
ABN , Publish Date - May 04 , 2026 | 12:24 AM
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ, సాహిత్య పేజీలో ప్రచురణ కొరకు, కవిత్వ శిక్షణా శిబిరం, విద్యార్థులకు కథల పోటీ...
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ
శ్రీనెల్లూరు వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో పి.వి.రమణారెడ్డి స్మృత్య ర్థం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ మే 8 సా.6గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రధాన వక్త వాడ్రేవు చినవీరభద్రుడు ఠాగూర్ కథలపై ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి, సభాధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మి.
వినయ
సాహిత్య పేజీలో ప్రచురణ కొరకు
సహజ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మే 10 సా.6గం టలకు విజయ నగరం, స్థానిక గ్రంథాలయంలో ‘రోణంకి అప్పలస్వామి–జీవితం–సాహిత్యం’ అంశంపై సాహిత్య సభ జరుగుతుంది. ప్రధాన వక్త రామ సూరి, ముఖ్య అతిథి కె. రామారావు.
ఎన్ కె బాబు
కవిత్వ శిక్షణా శిబిరం
తెలుగు శాఖ, డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ కళాశాల, యానాం & కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త నిర్వహణలో జూన్ 13, 14 తేదీలలో యానాంలో వర్ధమాన కవుల కోసం కవిత్వ శిక్షణా శిబిరం జరుగుతుంది. ప్రముఖ కవులు, విమర్శకులు వివిధ కవిత్వ అంశాలపై ప్రసంగిస్తారు. ఆసక్తి గల యువ కవులు సంక్షిప్త బయోడేటా, ఇటీవలి తమ ఒక కవితను మే 20 లోపు దాట్ల దేవదానం రాజు వాట్సాప్ నంబర్ :9440105987 కు పంపాలి. ఎంపికైన అభ్యర్థులు తమ ఖర్చులతో శిక్షణాశిబిరంలో పాల్గొనాలి. స్థానిక వసతి, భోజన సౌకర్యం సంస్థ కల్పిస్తుంది. చివరి రోజు ఒక కవిత్వాంశంపై కవిత రాయించి ఎంపికైన కవితలను కవి సంధ్య పత్రికలో ప్రచురిస్తాం.
వరుగు భాస్కర్ రెడ్డి
విద్యార్థులకు కథల పోటీ
తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి తెలుగు కథా రచన పోటీ నిర్వహిస్తుంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియేట్) వరకు చదివేవారు పాల్గొని జూలై 31 లోపు కథలు పంపాలి. ప్రతి గ్రూపులోనూ మొదటి, రెండవ, మూడవ బహుమతులు: రూ.10,000, రూ.7,500, రూ.5,000. మరిన్ని వివరాలకు: ww w.tels aworld.org లేదా ఈమెయిల్: telsa world@gmail. com.
మల్లిక్ కేశవరాజు
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ