ఈ వారం వివిధ కార్యక్రమాలు 29-09-2026
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:05 AM
‘గుగ్గిలం’ – జాషువా స్మృతి కవిత్వ సంకలనం, బోయ జంగయ్య జయంతి సభ, ‘అదనపు కణజాలం’ కవిత్వం, ‘వెన్నెల పదాలు’ పాటలు, ‘నడిపించిన వాక్యం’ కవిత్వం, కళింగాంధ్ర వర్తమాన సాహిత్యంపై సదస్సు, పురస్కారం, దీపావళి కథల పోటీ...
‘గుగ్గిలం’ – జాషువా స్మృతి కవిత్వ సంకలనం
ప్రభలత, డప్పోల్ల రమేష్ సంపాదకత్వంలో గుర్రం జాషువా స్మృతి కవిత్వం ‘గుగ్గిలం’ ఆవిష్కరణ అక్టోబరు 1 సా.5.30ని.లకు టిపిటిఎఫ్ భవన్, శాంతినగర్, సంగారెడ్డిలో జరుగుతుంది. ఆవిష్కర్త ఏనుగు నరసింహారెడ్డి, ముఖ్య అతిథి నాళేశ్వరం శంకరం, పుస్తక సమీక్ష జె. జయప్రకాష్, సభాధ్యక్షత బెల్లంకొండ సంపత్ కుమార్. అతిథులు కందుకూరి శ్రీరాములు, కెంపుల రాజు, మాతంగి చిరంజీవి, అబ్రహం మాదిగ తదితరులు. వివరాలకు: 95509 23323.
బహుజనం సాంస్కృతిక వేదిక
బోయ జంగయ్య జయంతి సభ
బోయ జంగయ్య జయంతి సభ అక్టోబరు 1 సా.5గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షుడు ఎన్. బాలాచారి, ముఖ్య అతిథి ఎ. వాణి ప్రసాద్. అతిథులు ఏనుగు నరసింహారెడ్డి, కోయ కోటేశ్వరరావు, దున్న యాదగిరి, కృపాకర్, కాశిం, బోయ చేతన్, బి.ఎస్. రాములు తదితరులు.
తెలంగాణ సాహిత్య అకాడమీ
‘అదనపు కణజాలం’ కవిత్వం
కందుకూరి అంజయ్య కవిత్వం ‘అదనపు కణజాలం’ ఆవిష్కరణ అక్టోబరు 2 ఉ.10.30గం.లకు కరీంనగర్ ఫిలిం సొసైటీ భవన్‌లో జరుగుతుంది. అధ్యక్షత సి.వి. కుమార్, ముఖ్య అతిథి జయధీర్ తిరుమలరావు, విశిష్ట అతిథి కొండి మల్లారెడ్డి, పుస్తక పరిచయం కూకట్ల తిరుపతి. అతిథులు పుప్పాల శ్రీరామ్, బూర్ల వెంకటేశ్వర్లు, తోట నిర్మలరాణి, పండుగ రత్నయ్య తదితరులు.
తెలంగాణ రచయితల వేదిక
‘వెన్నెల పదాలు’ పాటలు
అంబటి వెంకన్న ‘వెన్నెల పదాలు’ బతుకమ్మ పాటల సంపుటి ఆవిష్కరణ అక్టోబరు 3 ఉ.10గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కదిరె కృష్ణ, ఎం. వేదకుమార్, గుమ్మడి వెన్నెల, రమాదేవి, తేలు విజయ, మునాస వెంకట్, కార్టూనిస్ట్ శంకర్ పాల్గొంటారు.
జాబిలి కళామండలి
‘నడిపించిన వాక్యం’ కవిత్వం
గడ్డం సులోచన ‘నడిపించిన వాక్యం’ కవితా సంపుటి ఆవిష్కరణ అక్టోబరు 3 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత కందుకూరి శ్రీ రాములు, ఆవిష్కర్త నందిని సిధారెడ్డి, కృతి స్వీకర్త నాళేశ్వరం శంకరం. అతిథులు ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలాచారి, కొండపల్లి నీహారిణి తదితరులు. వివరాలకు: 9440119245.
కందుకూరి శ్రీరాములు
కళింగాంధ్ర వర్తమాన సాహిత్యంపై సదస్సు
సాహిత్య అకాడమీ & అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం ఆధ్వర్యంలో కళింగాం ధ్ర వర్తమాన సాహిత్యంపై సదస్సు అక్టోబరు 4 ఉ.10గం.ల నుంచి గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో జరుగుతుంది. సదస్సులో షణ్ముఖానంద, చింతకింది శ్రీనివాసరావు, జి.ఎస్. చలం, రత్నాల బాలకృష్ణ, బసు పోతన, ఆల్తి మోహనరావు తదితరులు పాల్గొంటారు.
సాహిత్య అకాడమీ
ఎం. రషీద్ ఫౌండేషన్
పురస్కారం
సాహిత్యం, సంస్కృతి, సాంఘిక సంస్కరణ, మానవ హక్కుల రంగాల్లోని కృషికి ప్రదానం చేసే కేరళకు చెందిన ‘ఎం. రషీద్ ఫౌండేషన్ అవార్డు’ను జూపాక సుభద్ర స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం అక్టోబరు 5 సా.5.30ని.లు త్రిసూర్ లోని సాహిత్య అకాడమీ ప్రాంగణంలో జరుగుతుంది. ప్రారంభోపన్యాసం కె. సచ్చిదానందన్, ‘ప్రజాస్వామ్యం – ఓటు హక్కు తొలగింపు’ అంశంపై స్మారకోపన్యాసం వాల్టర్ ఫెర్నాండెజ్ రషీద్.
ఎమ్. రషీద్ ఫౌండేషన్
దీపావళి కథల పోటీ
అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.10వేలు, 6వేలు, 4వేలు. పది కథలకు రూ.1000 చొప్పున ప్రత్యేక బహుమతులు. కంపోజ్ చేసి పంపేవారు వర్డ్ ఫైల్‌తో పాటు పిడిఎఫ్ జత చేయాలి. కాగితాలపై రాసి పంపేవారు పోస్టు చేయాలి. కథలను అక్టోబరు 20లోపు చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం 3, బ్లాక్ 6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్–500044, ఫోన్: 94900 99327, ఈమెయిల్: palapittamag@gmail. comకు పంపాలి.
గుడిపాటి
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి