ఈ వారం వివిధ కార్యక్రమాలు 27 04 2026
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:57 AM
‘కుమ్మరికుంటోని కథలు’ కథా సంపుటి, ‘డివిజి కథలు’ కథా సంపుటి, ‘ధ్వని’ పఠన కార్యక్రమం, చింతలపల్లి జీవన సాఫల్య పురస్కారం, అమృతలత అపురూప అవార్డులు...
‘కుమ్మరికుంటోని కథలు’ కథా సంపుటి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో చెమన్ కథా సంపుటి ‘కుమ్మరికుంటోని కథలు’ ఆవిష్కరణ ఏప్రిల్ 28 సా.5.30 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత దేశపతి శ్రీనివాస్; ముఖ్య అతిథి, ఆవిష్కరణ నందిని సిధారెడ్డి; సమీక్ష కాశీం; విశిష్ట అతిథులు ఏనుగు నరసింహ రెడ్డి, నామోజు బాలాచారి, పెద్దింటి అశోక్‌కుమార్, స్వర్ణ కిలారి.
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
‘డివిజి కథలు’ కథా సంపుటి
డివిజి శంకరరావు కథా సంపుటి ‘డివిజి కథలు’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 29 సా.6గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్, విజయనగరంలో జరుగుతుంది. అట్టాడ అప్పల్నాయుడు, యం.జయచంద్రనాయుడు తదితరులు పాల్గొంటారు.
పాయల మురళీకృష్ణ
‘ధ్వని’ పఠన కార్యక్రమం
బమ్మడి జగదీశ్వరరావు కథల నుంచి పఠన కార్యక్రమం ‘ఊరవతల దీపాల ఊసులు’ ఏప్రిల్ 30 సా.7గంటల నుంచి లామకాన్, రోడ్ నెం.1. బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది.
సుమనస్పతి
చింతలపల్లి జీవన సాఫల్య పురస్కారం
చింతలపల్లి నిర్మలాదేవి–నారాయణ రావు జీవనసాఫల్య పురస్కారం రావులపాటి సీతారాంకు ఇచ్చే కార్యక్రమం ఏప్రిల్ 30 సా.5గంటలకు సారస్వత పరిషత్, తిలక్ రోడ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్యఅతిథి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి; ఆత్మీయ అతిథులు ఆచార్య కాత్యాయనీ విద్మహే, ప్రసేన్ బెల్లంకొండ, యస్. రఘు. వివరాలకు: 94927 65358.
వనపట్ల సుబ్బయ్య
అమృతలత అపురూప అవార్డులు
అమృతలత అపురూప అవార్డుల ప్రదానోత్సవం మే 10 సా.4.30 గంటలకు సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్‌లో జరుగుతాయి. లలిత సంగీతంలో హైమవతీ భీమన్న, నవలా రచనలో పెళ్ళకూరు జయప్రద, శాస్త్రీయ సగీతంలో బుర్రా వరహాలు అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను స్వీకరిస్తారు. యం.కె.ఆర్. ఆశాలత, పుట్టి నాగలక్ష్మి, దేవులపల్లి వాణీదేవి, మైథిలి అబ్బరాజు, తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి, భావరాజు పద్మిని, అంజలి, ఎస్ మాధవి, రేలారే రేలా మంగ వివిధ విభాగాలలో అపురూప అవార్డులు తీసుకుంటారు. వివరాలకు: 94406 22781.
నెల్లుట్ల రమాదేవి
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News