ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 05 2026
ABN , Publish Date - May 25 , 2026 | 12:39 AM
స్మృతి సంచికకు రచనల ఆహ్వానం, శీలావీ పురస్కారాల ప్రదానం, ‘పెద్దబాడిసె’ కవితా సంపుటి, గోలకొండ పత్రికపై పరిశోధన గ్రంథం, సురవరం జయంతి ఉత్సవం....
స్మృతి సంచికకు రచనల ఆహ్వానం
ముక్తవరం పార్థసారథి స్మృతిలో ఒక సంచిక తీసుకురావడానికి సన్నాహాలు మెదలయ్యాయి. మిత్రులందరూ ఆయనపై తాము రాసిన వ్యాసాలు, తమ దృష్టికి వచ్చిన ఆర్టికల్స్, ఆయన గురించి జ్ఞాపకాలు, ఆయన ఫోటోలు, ఉత్తరాలను ఈమెయిల్: vkmukthavaram @gmail.com, లేదా వాట్సాప్ నెంబర్ 91776 18708కు జూన్ 10 లోపు పంపాలి.
బమ్మిడి జగదీశ్వరరావు
శీలావీ పురస్కారాల ప్రదానం
శీలా వీర్రాజు పేరు మీద 2026 నవలా పురస్కారానికి ‘నీలంపురాశి’ రచయిత్రి చంద్రలత, చిత్రకళా పురస్కారానికి పగిడిచెంబుల మనీషా ఎంపికయ్యారు. జూన్ 7 సా. 6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్ లో జరిగే సభలో వారికి చెరో రూ. 15వేల నగదు, జ్ఞాపికలతో పురస్కార ప్రదానం ఉంటుంది. సభలో నెల్లుట్ల రమాదేవి, వారణాసి నాగలక్ష్మి, ఏనుగు నరసింహారెడ్డి, పి. జ్యోతి, రేఖ పాల్గొంటారు.
శీలా సుభద్రాదేవి
‘పెద్దబాడిసె’ కవితా సంపుటి
మియాపురం శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణుల వృత్తిపనిముట్లు అంశంపై రాసిన కవిత్వ సంపుటి ‘పెద్ద బాడిసె’ ఆవిష్కరణ మే 27న ఫిలింభవన్, కరీంనగర్‌లో జరుగుతుంది. ఆవిష్కర్తలు కొలగాని శ్రీనివాస్, వై రాగ్యం ప్రభాకర్. వివరాలకు: 94932 64620.
భవానీ సాహిత్య వేదిక
‘రావణ బ్రహ్మ’ పౌరాణిక పద్యనాటకం
రాజాం రచయితల వేదిక 136వ సమావేశంలో కీ.శే. కాకినాడ పూజ్యనాథం ఆచారి రాసిన ‘రావణ బ్రహ్మ’ పౌరాణిక పద్యనాటకాన్ని యడ్ల గోపాలరావు ఆవిష్కరిస్తారు. ఈ సమావేశం మే 31 ఉ .10 గం టలకు విజయనగరం జిల్లా రాజాంలో గల జె.జె. ఇన్నోటెల్‌లో జరుగుతుంది. అధ్యక్షత గార రంగనాథం, అతిథులు మరడాన శ్రీనివాసరావు, పాటోజు బ్రహ్మాజీరావు, కాకినాడ స్వర్ణలక్ష్మి తదితరులు.
రాజాం రచయితల వేదిక
గోలకొండ పత్రికపై పరిశోధన గ్రంథం
నుగ్గునూతుల యాకయ్య పరిశోధన గ్రంథం ‘గోలకొండ పత్రిక – సాహిత్య, సాంస్కృతిక చైతన్యం’ ఆవిష్కరణ సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మే 28 ఉ.10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరుగుతుంది. అధ్యక్షత కాత్యాయనీ విద్మహే, ముఖ్యఅతిథి కోదండరాం, ఆవిష్కర్త కె.రామ చంద్రమూర్తి, విశిష్ట అతిథి కె. శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అతిథులుగా వర్ధెల్లి మురళి, అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డి, ఎన్.వేణుగోపాల్, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు హాజరవుతారు. వివరాలకు: 89199 13723.
నవచేతన
సురవరం జయంతి ఉత్సవం
తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి 130వ జయంతి ఉత్సవం మే 28న దాచ సులోచనమ్మ ఏసీ కన్వెన్షన్ హాల్, వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతుంది. అధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, స్వాగత ఉపన్యాసం కె. వీర య్య, ప్రధాన వ క్తలు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, ఆర్.యస్. ప్రవీణ్ కుమార్. మాజీమంత్రి నిరంజన్ రెడ్డి రాసిన ‘మన కల నిజం’ పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టుల అంశంపై శీధర్ రావు దేశ్ పాండె, తెలంగాణ పౌర సమాజం ముందున్న కర్త వ్యం అంశంపై వి. ప్రకాష్, సామాజిక ఆర్థిక రంగ అంశం పై ఎ. జయంతి, తెలంగాణ సమాజం–స్త్రీలు అంశంపై తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి మాట్లాడుతారు. వివరాలకు: 93473 82815.
కె. వీరయ్య
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత