Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-11-2026

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:32 AM

‘చూపుడువేలు’ కవిత్వ సంపుటి, పెండ్యాల రాఘవరావు జీవితం, జాషువా పురస్కారం, ఇంద్రగంటి పురస్కారం, ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-11-2026

‘చూపుడువేలు’ కవిత్వ సంపుటి

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎదిరెపల్లి కాశన్న ‘చూపుడువేలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ నవంబరు 24 ఉ.10 గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత వనపట్ల సుబ్బయ్య, ముఖ్య అతిథి నందిని సిధారెడ్డి, ఆవిష్కర్త జూలూరు గౌరీశంకర్, విశిష్ట అతిథులు ఏనుగు నరసింహారెడ్డి, కవి యాకూబ్. వివరాలకు: 96400 06304.

ఎదిరెపల్లి మశమ్మ స్మారక ఫౌండేషన్

పెండ్యాల రాఘవరావు జీవితం

స్వాతంత్ర్య సమరయోధుడు, వరంగల్ జిల్లా తొలి ఎంపీ పెండ్యాల రాఘవరావు జీవితం ఆధారంగా మను నెల్లుట్ల రచించిన ‘ది ఫర్గాటెన్‌ మావెరిక్‌’ పుస్తకం ఆవిష్కరణ సభ నవంబరు 24 ఉ.10గం.ల నుంచి ప్రెస్ క్లబ్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త వరంగల్ ఎంపీ కడియం కావ్య; గౌరవ అతిథులు కె. శ్రీనివాసరెడ్డి, కూరపాటి వెంకటరమణ; అధ్యక్షత నెల్లుట్ల రమాదేవి.

కొండపల్లి నీహారిణి

జాషువా పురస్కారం

మహాకవి జాషువా పురస్కార ప్రదానం నవంబరు 28 సా.6 గంటలకు ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్‌, ఖమ్మంలో జరుగుతుంది. దర్శకుడు వేణు ఊడుగుల స్వీకరిస్తారు. అధ్యక్షత మువ్వా శ్రీనివాసరావు, ముఖ్య అతిథి డొక్కా వరప్రసాద్, విశిష్ట అతిథులు ప్రసాదమూర్తి, అంబటి మురళీ కృష్ణ, కాటేపల్లి నవీన్.

జాషువా సాహిత్య వేదిక

ఇంద్రగంటి పురస్కారం

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2026కు కవి వఝల శివకుమార్ తీసుకుంటారు. పురస్కార ప్రదానం నవంబరు 28 సా.6గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైద రాబాద్‌లో జరుగుతుంది. అధ్య క్షత కోయి కోటేశ్వరరావు, వక్త దేవనపల్లి వీణావాణి. కవికి రూ.25వేల నగదు, దుశ్శాలువ, మెమెంటోలతో సత్కారం.

ఇంద్రగంటి జానకీబాల

‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ

ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.20వేలు, 15వేలు, 10వేలు. ప్రోత్సాహక బహుమతులు రూ.5వేల చొప్పున ఐదు. కథలను డిసెంబర్ 25 లోపు డిటిపి లేదా వర్డ్‌ ఫైల్‌ ఎ4 సైజులో ౪ పేజీలకు మించకుడా bcmkantha@gmail.comకు ఈమెయిల్‌, లేదా 97930 59793కు వాట్సాప్‌, లేదా చిరునామా: ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ, ఆనంద నిలయం, ఇం.నం. 1–5–1020/4, బి.ఆర్. రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్–500010కు పోస్ట్‌ పంపగలరు. ఫోన్: 99636 16999.

ఎమ్.ఎల్. కాంతారావు

ఇవి కూడా చదవండి..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..

రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

Updated Date - Nov 23 , 2026 | 01:32 AM