Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-08-2026

ABN , Publish Date - Aug 24 , 2026 | 02:35 AM

విద్యార్థులకు రచనల పోటీ, ‘గురజాడ అన్నారష..!’ , ‘అతడు అడవిని ప్రేమించాడు’, కథ, కవితా సంపుటాల పోటీ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-08-2026

విద్యార్థులకు రచనల పోటీ,

ఉత్తరాంధ్ర జిల్లాల ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ కాలేజీల విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నాం. నిరుద్యోగం, విద్యా విధానంలో లోపాలు, జెన్ జీ ఆందోళనలు తదితర వస్తువులతో 30లైన్లు మించని కవిత, ఏ4 సైజులో రెండు పేజీలకు మించని కథ లేదా వ్యాసాలను రాసి పంపాలి. వీటిని సెప్టెంబర్ 10లోపు 94900 98811 నెంబర్‌కు వాట్సాప్ కానీ, చిరునామా: కేతవరపు శ్రీనివాసు, 8–42/1, తిలక్ నగర్, ఇలిసిపురం, శ్రీకాకుళం 532001కు పోస్టు ద్వారా గాని పంపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.2వేలు, రూ.1000, రూ.500.

కేతవరపు శ్రీనివాసు కన్వీనర్

‘గురజాడ అన్నారష..!’

బొబ్బిలి శ్రీధర్‌ సంపాదకత్వంలో ‘గురజాడ అన్నారష..!’ పుస్తకం ఆవిష్కరణ సభ ఆగస్టు 25 సా. 6గం టలకు గురజాడ గృహం, విజయనగరంలో జరుగుతుం ది. సభాధ్యక్షులు బొద్దూరు విజయేశ్వరరావు, ఆవిష్కర్త నారాయణ వేణు, ప్రచురణకర్త దుప్పల రవి కుమార్‌.

రత్నాల బాలకృష్ణ

‘అతడు అడవిని ప్రేమించాడు’

ఉప్పరపాటి వెంకటేశులు కథా సంపుటి ‘అతడు అడవిని ప్రే మించాడు’ ఆవిష్కరణ సభ ఆగస్టు 30 ఉ.10గంటలకు యన్‌. జి. ఒ హోమ్‌, అనంతపురంలో జరుగుతుంది. సభాధ్యక్షులు రాజారా మ్‌ తూముచర్ల; ముఖ్య అతిథులు శాంతి నారాయణ, బండి నారాయణస్వామి.

అశేరా

కథ, కవితా సంపుటాల పోటీ

ఆదిత్య స్కూల్స్‌, పిఠాపురం నిర్వహణలో కథ/ కవితా సంపుటాల పోటీకి జనవరి 2025–ఆగస్టు 2026 మధ్య ప్రచురితమైన కథ/ కవితా సంపుటాలు రెండు కాపీలు పంపాలి. ఉత్తమ సంపుటాలకు రూ.5వేల బహుమతి. పుస్తకాలను సెప్టెంబర్‌ 5లోపు చిరునామా: ఆదిత్య స్కూల్‌, సీతయ్యగారితోట, పిఠాపురం–533450, ఫోన్‌: 9494 553425కు పంపాలి.

నల్లమిల్లి శేషారెడ్డి

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 02:35 AM