Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2-11-2026

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:14 AM

మల్లావఝల సదాశివుడు స్మారక సాహిత్య పురస్కరాల ప్రదానం, ‘ద వైట్‌ షిప్‌’కు తెలుగు అనువాదం ఆవిష్కరణ, ఉమ్మడిశెట్టి అవార్డుకై కవితా సంపుటాలకు ఆహ్వానం, కొలకలూరి ఇనాక్‌పై వ్యాసాలకు ఆహ్వానం..

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2-11-2026

మల్లావఝల సదాశివుడు స్మారక సాహిత్య పురస్కరాల ప్రదానం

మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవం నవంబర్ 3 సాయంత్రం 5 గం.లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియం, ఖైరతాబాద్, హైదరాబాద్‌లో జరుగుతుంది. 2024–25 సంవత్సరానికి చెమన్ సింగ్‌, 2025–26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌ పురస్కారాలు తీసుకుంటారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిలకు ప్రత్యేక సత్కారం ఉంటుంది. అధ్యక్షత వనపట్ల సుబ్బయ్య, ముఖ్య అతిథి మాజీమంత్రి కె.టి.రామారావు, విశిష్ట అతిథి గోరటి వెంకన్న, ఆత్మీయ అతిథి దేశపతి శ్రీనివాస్.

తెలంగాణ వికాస సమితి

‘ద వైట్‌ షిప్‌’కు తెలుగు అనువాదం ఆవిష్కరణ

చింగీజ్ ఐత్‌మాతొవ్ ‘ద వైట్ షిప్’ నవలకు తెలుగు అనువాదం ‘తెల్ల జింక’ ఆవిష్కరణ సభ నవంబరు 7 సా.4 గంటలకు గుంటూరు లక్ష్మీపురంలోని ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ హాల్‌లో జరుగుతుంది. అధ్యక్షత కాట్రగడ్డ దయానంద్, ముఖ్య అతిథి పి.సత్యవతి, ఆవిష్కర్త చెరుకూరి సత్యనారాయణ. సభలో అనువాదకుడు కందిమళ్ల శివ ప్రసాద్, ప్రచురణకర్త అనిల్ బత్తుల పాల్గొంటారు.

అనిల్ బత్తుల పబ్లికేషన్స్

ఉమ్మడిశెట్టి అవార్డుకై కవితా సంపుటాలకు ఆహ్వానం

ఉమ్మడిశెట్టి అవార్డు–2026 కోసం కవుల నుండి 2026లో ప్రచు రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన ఉత్తమ కవితాసంపుటికి రూ.6వేలు నగదుతోపాటు, కవికి షీల్డ్‌తో సత్కారం ఉంటుంది. డిసెంబరు 31 లోపు నాలుగు ప్రతులను చిరునామా: ఉమ్మడిశెట్టి రాధేయ, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్, 13–1–606–1 షిర్డీ నగర్, రెవిన్యూ కాలనీ, అనంతపురం–515 001, ఫోన్‌: 99851 71411కు పంపాలి.

రాధేయ

కొలకలూరి ఇనాక్‌పై వ్యాసాలకు ఆహ్వానం

ఆచార్య కొలకలూరి ఇనాక్ రచనలపై వివిధ పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో, పత్రాలలో వచ్చిన వ్యాసాలను, రేడియో, టీవీలలో వచ్చిన ఉపన్యాసాలను అవి తెలుగు సాహిత్యానికి ఉపయుక్తమైనవిగా భావించి పుస్తకరూపంలో ముద్రించాలనుకుంటున్నాము. మీరు రాసిన లేదా మీ దగ్గర ఉన్న వ్యాసాలను ఈమెయిల్‌: enocharticles2026@gmail. com కు దయచేసి జనవరి 1, 2027లోపు పంపగలరని మనవి. వివరాలకు ఫోన్‌: 80086 36981.

రవీంద్రబాబు

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 02:14 AM