ఈ వారం వివిధ కార్యక్రమాలు 19-10-2026
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:14 AM
‘అగమ్య గమ్యాలు’, దాసరి శిరీష జ్ఞాపిక, యూత్ లిటరరీ ఫెస్ట్, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వార్షికోత్సవం, ‘నీడల ప్రపంచం’ వ్యాస సంపుటి, కథల పోటీకి ఆహ్వానం..
‘అగమ్య గమ్యాలు’
ముకుంద రామారావు రచన ‘అగమ్య గమ్యాలు’ ఆవిష్కరణ సభ అక్టోబరు 23 సా. 6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరుగుతుంది. అధ్యక్షత డి.పి. అనురాధ, ఆవిష్కర్త మలిగా నాయుడు, ముఖ్య అతిథి కె. శ్రీనివాస్, గౌరవ అతిథి ఏనుగు నరసింహారెడ్డి.
ఎ.కె. ప్రభాకర్
దాసరి శిరీష జ్ఞాపిక
దాసరి శిరీష జ్ఞాపిక 2026ను ‘అరుంధతీయం’ రచనకు కవిత పులి, తోట శేషుబాబు జ్ఞాపిక 2026ను శారద కళాకారిణి కళ్లెం లచ్చుమమ్మ అందుకుంటారు. ఈ కార్యక్రమం అక్టోబరు 24 సా. 6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరుగుతుంది.
అపర్ణ తోట
యూత్ లిటరరీ ఫెస్ట్
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో అక్టోబరు 24, 25 తేదీల్లో నాగార్జునసాగర్ ‘బుద్ధవనం’ వేదికగా యూత్ లిటరరీ ఫెస్ట్ – 2026 జరుగుతంది. యువత సృజించిన కవిత్వం, కథలపైన యువ సాహితీవేత్తలే చర్చిస్తారు. వివరాలకు, భాగస్వామ్యానికి సంప్రదించాల్సిన నంబర్: 88977 65417.
కె. ఆనందాచారి
తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వార్షికోత్సవం
తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి 14 వార్షికోత్సవం అక్టోబరు 25న పలమనేరు సాయి గార్డెన్ సిటీలో కళామందిరంలో జరుగుతుంది. తెలుగు భాషా పోటీల్లో గెలిచిన యాభై మంది విద్యార్థులకు బహుమతులతోపాటు, పద్నాలుగు మందికి పురస్కారాలు అందిస్తారు.
పి. తులసినాథం నాయుడు
‘నీడల ప్రపంచం’ వ్యాస సంపుటి
ఎన్. తిర్మల్ వ్యాసాల సంపుటి ‘నీడల ప్రపంచం’ ఆవిష్కరణ సభ అక్టోబరు 26 సా.౬గంటలకు రవీంద్రభారతి హైదరాబాద్లో జరుగుతుంది. అధ్యక్షత హనీఫ్, ఆవిష్కరణ అయాచితం శ్రీధర్, ముఖ్య అతిథులు సతీష్ చందర్, ఆకునూరి మురళి, ఏనుగు నరసింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్.
ప్రజా సంస్కృతి
కథల పోటీకి ఆహ్వానం
యలమర్తి మహాలక్ష్మమ్మ స్మారక సింగిల్ పేజీ కథల పోటీకి మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.2500, 1500, 1000. ఎ4సైజు కాగితానికి ఒకపక్కనే రాతప్రతిలో 2 పేజీలు, డిటిపి (అనుఫాంట్ 15సైజు) ఐతే ఒక్క పేజీ లోపు ఉండాలి. నవంబరు 30 లోపు చిరునామా: సంపాదకులు, సాహితీ కిరణం, ఇం.నెం. 11–13–154, అలకాపురి, రోడ్ నెం.3, హైదరాబాద్–500102, ఫోన్– 94907 51681కు పంపాలి.
సాహితీ కిరణం
ఈ వార్తలూ చదవండి
దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి
రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!