రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:07 AM
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల్లో దంపతులు, ముగ్గురు పిల్లలున్నారు.
యూపీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అనుమానాస్పద మృతి
గ్రేటర్ నోయిడా, అక్టోబరు 17: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల్లో దంపతులు, ముగ్గురు పిల్లలున్నారు. నంగ్లాపాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతులను మహేశ్(38),ఆయన భార్య లలిత(34), కుమారుడు లడ్డూ(12), కూతుళ్లు మిష్టి(8), సాక్షి(4)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి మహేశ్ కుటుంబం నిద్రపోయే ముందు ఇన్స్టంట్ మ్యాగీ నూడుల్స్ తిని, ఆపై టీ తాగినట్లు సమాచారం. తెల్లవారే సరికి వాళ్లు ఐదుగురు మంచాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.