ఈ వారం వివిధ కార్యక్రమాలు 17-08-2026
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:34 AM
‘ధ్వని’: శ్రవ్య – రూప ప్రదర్శన, ‘తంపర’ వ్యాస సంపుటి, పుస్తకాల ఆవిష్కరణ, గిరిజన కథలకు ఆహ్వానం, ‘సృజనోత్సవం’ సాహిత్య సాంస్కృతిక సందడి...
‘ధ్వని’: శ్రవ్య – రూప ప్రదర్శన
మరువం (మాటల వేదిక), లామకాన్ కలిసి సమర్పిస్తున్న ‘ధ్వని’ – 7వ కార్యక్రమంలో మెర్సీ మార్గరెట్ కవితలతో– ముఖ్యంగా ప్రేమ కవితలతో– శ్రవ్య రూప ప్రదర్శన ఆగస్టు 21 సా.6.15 ని.లకు లామకాన్, జీవీకే మాల్ ఎదురు సందులో, రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. వివరాలకు: 96761 80802
సుమనస్పతి
‘తంపర’ వ్యాస సంపుటి
శ్రీకాకుళ సాహితి, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అట్టాడ అప్పల్నాయుడు వ్యాస సంపుటి ‘తంపర’ ఆవిష్కరణ ఆగస్టు 23 ఉ.10 గం.లకు శ్రీకాకుళం జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భవనంలో జరుగుతుంది. సభలో శిరంశెట్టి కాంతారావు & గంటేడ గౌరునాయుడుల రచన ‘ఎన్నో ఉదయాలు–రెండు హృదయాలు’ ఆవిష్కరణ ఉంది. చిగురుపల్లి ప్రభాకరరావు, చీకటి దివాకర్, కంచరాన భుజంగరావు తదితరులు హాజరౌతారు.
చంపావతి
పుస్తకాల ఆవిష్కరణ
అమృతలత స్వీయ జీవితకథ ‘నా ఏకాంత బృందగానం’కు పీసపాటి శ్రీరామ మూర్తి ఇంగ్లీష్ అనువాదం ‘మై సోలిటరీ కోరస్’, విజయా కిషన్ రెడ్డి కవితా సంపుటి ‘మానస సంచరరే’ పుస్తకాల ఆవిష్కరణ ఆగస్ట్ 23 సా.4.45గం.లకు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్యఅతిథి నందిని సిధారెడ్డి, విశిష్ట అతిథి ఎ.ఎస్. లక్ష్మి, సభాధ్యక్షత నెల్లుట్ల రమాదేవి. ఇదే వేదికపై అమృతలత, కొండపల్లి నీహారిణి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం వుంటుంది.
నెల్లుట్ల రమాదేవి
‘సృజనోత్సవం’ సాహిత్య సాంస్కృతిక సందడి
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 23న విజయవాడ – ఠాగూర్ గ్రంథాలయంలో ‘సృజనోత్సవం’ జరుగుతుంది. గిడుగు సేవా పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగుభాష అంశంగా కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణలు, గజల్ గానం వుంటాయి. కలెక్టర్ జి. లక్ష్మీశ ప్రారంభిస్తారు. వివరాలకు: 92464151500.
కలిమిశ్రీ
గిరిజన కథలకు ఆహ్వానం
గిరిజన జీవన విధానం, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, భాష సామాజిక పోరాటాలను ప్రతిబింబించే కథలతో ఒక ‘గిరిజన కథల సంపుటి’ని తెస్తున్నాం. రచయితలు వాట్సాప్ నంబర్లు: 6305 584064, 94413 35123 లేదా ఈమెయిల్: dsainath0606 @gmail.comకు కథలను పంపాలి.
డి. సాయినాథ్ రెడ్డి
ఈ వార్తలనూ చదవండి:
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..
ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు