Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 02 2026

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:25 AM

‘భూపతి చంద్ర’ కథానికల పోటీ విజేతలు, తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్, మహాకవి పంపన పురస్కార ప్రదానం, కొలకలూరి పురస్కారాల విజేతలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 02 2026

‘భూపతి చంద్ర’ కథానికల పోటీ విజేతలు

‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞాపురం నిర్వహించిన కథానికల పోటీ విజేతలకు పురస్కారాల ప్రదానం ఫిబ్రవరి 19 సా.5గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా సుంకోజి దేవేంద్రాచారి, పొత్తూరి సీతారామరాజు, పుప్పాల కృష్ణమూర్తి; ప్రోత్సాహక బహుమతులకు ఎం. సుగుణ రావు, చొక్కర తాతారావు, మొయిద శ్రీనివాసరావు, ఉయ్యూరు అనసూయ, మధుసూదన రావు ఎంపికయ్యారు. వివరాలకు: 99636 16999.

ఎమ్‍.ఎల్‍. కాంతారావు

తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్

తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ – 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఏవి కళాశాల, హైదరాబాద్‌లో జరుగుతుంది. కవిత్వం, కథ, నవల, పాట, విమర్శ, మహిళా, యువ సాహిత్యాలపై చర్చలు, పుస్తకావిష్కరణలు, పుస్తకప్రదర్శనలు, ఫోటో ఎగ్జిబిషన్, నాటక ప్రదర్శనలు ఉంటాయి. అతిథులుగా– నందిని సిధారెడ్డి, గోరటి వెంకన్న, శివలింగప్ప (కన్నడ), ఆరీఫ్ రాజా, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలాచారి తదితరులు పాల్గొంటారు.

అనంతోజు మోహన్ కృష్ణ

మహాకవి పంపన పురస్కార ప్రదానం

అక్షరయాన్‌ తెలుగు విమెన్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌, అభిజ్ఞ భారత్‌ ఆర్గనైజేషన్‌, సీతాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం, మహాకవి పంపన జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఫిబ్రవరి 21 ఉ.9.30 గంటలకు బి.పి.ఆర్‌ విఠల్‌ ఆడిటోరియమ్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్ అండ్‌ సోషల్‌ స్టడీస్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. మామిడి హరికృష్ణ పురస్కారం స్వీకరిస్తారు. సభలో చెన్నమనేని విద్యాసాగర్‌ రావు, హం.ప. నాగరాజయ్య, వకుళా భరణం రామకృష్ణ తదితరులు పాల్గొంటారు.

అయినంపూడి శ్రీలక్ష్మి

కొలకలూరి పురస్కారాల విజేతలు

కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం రూ. 20వేల బహుమతికి పలమనేరు బాలాజీ ‘ఏకలవ్య కాలనీ’, రూ.10 వేల బహుమతికి స్వర్ణ కిలారి ‘నల్ల బంగారం’; కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం రూ. 20వేల బహుమతికి బి. నాగశేషు ‘ఏకుదారం’; కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం రూ.20వేల బహుమతికి కెంగార మోహన్ ‘చెమట చెక్కిన వాక్యం’, రూ.10వేల బహుమతికి ఎం.వి. రామిరెడ్డి ‘విస్తార’ పుస్తకాలు ఎంపికయ్యాయి. పురస్కార ప్రదానం ఫిబ్రవరి 26 సా.6గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. మరిన్ని వివరాలకు: 94419 23172.

కొలకలూరి మధుజ్యోతి

ఇవి కూడా చదవండి..

శివనామస్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు.. శివరాత్రి జాగరణ కోసం సకల ఏర్పాట్లు

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

Updated Date - Feb 16 , 2026 | 03:25 AM