Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15-09-2026

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:29 AM

గడియారం సాహిత్య పురస్కారాలు, కవిసంధ్య పురస్కారాలు, ముస్లింవాద సాహిత్య సదస్సు, బాల రచయితల కథల పోటీ, సాహిత్య పురస్కారాల ప్రదానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15-09-2026

గడియారం సాహిత్య పురస్కారాలు

గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కార ప్రదాన సభ ఎం. వి.ఆర్. ఫౌండేషన్ నిర్వహణలో రచన సాహిత్య వేదిక (కడప), గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 20 సా.5.30గం.లకు శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం, సుల్తాన్ బజార్, హైదరాబాద్‌లో జరుగు తుంది. అప్పాజోస్యుల సత్యనారాయణ రాసిన ‘పంచవటి’ కావ్యం ఎంపికైంది. ఆయనకు రూ.10వేల నగదు, పుర స్కార పత్రంతో సన్మానం ఉంటుంది. వివరాలకు: 99666 24276.

భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి

కవిసంధ్య పురస్కారాలు

‘కవిసంధ్య’ ప్రతీ ఏటా ఇచ్చే ‘శిఖామణి జీవన సాఫల్య సాహితీ పురస్కారం–2026’కు బేతవోలు రామబ్రహ్మం, యువకవులకు యిచ్చే ‘శిఖామణి యువపురస్కారం–2026’కు దొండపాటి నాగ జ్యోతి ఎంపిక అయ్యారు. వీరితో పాటు మరో అయిదుగురు కవి సంధ్య ప్రతిభా పురస్కారాలు అందుకుంటారు. ఈ పురస్కారాల ప్రదానం అక్టోబర్ చివరి వారంలో యానాంలో జరిగే శిఖామణి సప్తతి సాహితీ సదస్సులో ఉంటుంది. వివరాలకు: 9848202526.

దాట్ల దేవదానంరాజు

ముస్లింవాద సాహిత్య సదస్సు

ముస్లింవాద సాహిత్య సదస్సు సెప్టెంబరు 19–20 తేదీల్లో హైదరాబాద్‌, కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆర్థిక సహకారంతో జరుగుతుంది. సెప్టెంబరు 19 ఉ.10గం టలకు ప్రారంభ సభలో ఖాదర్‌ మొహియుద్దీన్‌, నామోజు బాలాచారి, షాజహానా, జూపాక సుభద్ర, అంబటి సురేంద్రరాజు, లక్ష్మీనరసయ్య, కె. శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కై బాబ పాల్గొంటారు. ముస్లింవాద కవిత సభలో కవి యాకూబ్‌, సీతారాం, మెర్సీ మార్గరెట్‌, రహీమొద్దీన్‌, వనపట్ల సుబ్బయ్య, కోయి కోటేశ్వరరావు, స్వప్న కొండమడుగు మాట్లాడతారు. ముస్లిం సంఘీభావ కవిసమ్మేళనం, పాటల సభకు పసునూరి రవీందర్‌ అధ్యక్షత, నిర్వహణ ఇనాయతుల్లా, ముఖ్య అతిథి గోరటి వెంకన్న. సెప్టెంబర్‌ 20 ఉ.10 గంటలకు జరిగే ముస్లింవాద విమర్శ సభలో ఎస్. షమీ ఉల్లా, సంగిశెట్టి శ్రీనివాస్, ఎకె ప్రభాకర్‌, షేక్‌ ఇబ్రహీం, సందీప్‌ వొటారికారి మాట్లాడతారు. ముస్లింవాద కథ, నవల సభలో వేంపల్లె షరీఫ్‌, వెంకటకృష్ణ, దాదాహయాత్‌, అన్వర్‌, హుమాయూన్‌ సంఘీర్‌ పాల్గొంటారు.

హర్యాలీ ముస్లిం రచయితల వేదిక


బాల రచయితల కథల పోటీ

నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాస పత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ‘కథల పోటీ–2026’ నిర్వహిస్తుంది. ప్రతిభావంతులైన బాల రచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకు లకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 14 లోపు కథలను ఈమెయిల్: desk. chelimi@gmail.com; వాట్సాప్: 86866 64949 కు పంపాలి.

గరిపెల్లి అశోక్

సాహిత్య పురస్కారాల ప్రదానం

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 ఉ.10గం.లకు గుంటూరు లక్ష్మీపురంలోని శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘంలో ‘సాహిత్య పుర స్కారాల ప్రదానోత్సవం & సమకా లీనం’ సాహిత్య సదస్సు జరుగుతుంది. పురస్కార గ్రహీతలు విజయ్ కోగంటి (‘ఎవరిదీ చూపు?’), స్వర్ణ కిలారి (‘గోడ వతల’)కి సత్కారం వుంటుంది. మ.2 గం.లకు ‘సమకాలీనం’ సాహిత్య సదస్సు ప్రారంభమవుతుంది.

సి. భవానీదేవి

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 01:29 AM