Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15-06-2026

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:16 AM

‘మెరుగు 2.0’ కవిత్వ పఠనం, ‘నాన్న చెక్కిన శిల్పం’ ఆవిష్కరణ, పీర్ల పండుగ కవి సమ్మేళనం , ‘ఈర్నం’ కవితా సంపుటి, కవితలకు ఆహ్వానం

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15-06-2026

‘మెరుగు 2.0’ కవిత్వ పఠనం

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ‘మెరుగు 2.0’ ప్రారంభ కార్యక్రమం జూన్ 15 సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో గురజాడ గృహంలో జరుగుతుంది. ఇడదాసు తిరుపతి రాజు, జైపాల్‌ రావు, కాకర మౌనిక, బాలమురళీకృష్ణ కవిత్వం చదువుతారు. కంచరాన భుజంగరావు, మానాపురం రాజా చంద్రశేఖర్‌ సమీక్షిస్తారు.

పాయల మురళీకృష్ణ

‘నాన్న చెక్కిన శిల్పం’ ఆవిష్కరణ

జాలాది రత్న సుధీర్‌ రచన ‘నాన్న చెక్కిన శిల్పం’ ఆవిష్కరణ సభ జూన్‌ 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ ‘సాహిత్యవారం’ కార్యక్రమంలో భాగంగా జరిగే ఈ సభలో నామోజు బాలాచారి, ఏనుగు నరసింహారెడ్డి, ఏ. దినకర్‌ బాబు, ఎస్‌. రఘు, నీలిమ వి.ఎస్‌.రావు, సి.ఎస్‌. రాంబాబు తదితరులు పాల్గొంటారు.

గుడిపాటి

పీర్ల పండుగ కవి సమ్మేళనం

అలాయి బలాయి, నెలపొడుపు సాహిత్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో పీర్ల పండుగ సందర్భంగా ‘అక్షరాల అలువ’ పేరుతో కవి సమ్మేళనం జూన్‌ 21 సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, యాకూబ్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు. కవులు పేర్లను నమోదుచేసుకోవాల్సిన నంబర్‌: 94927 65358.

వనపట్ల సుబ్బయ్య

‘ఈర్నం’ కవితా సంపుటి

చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక ఆధ్వర్యంలో కలమట దాసుబాబు తొలి‌ కవిత్వ సంపుటి ‘ఈర్నం’ ఆవిష్కరణ సభ జూన్ 21 ఉదయం శ్రీకాకుళం టౌన్‌లో వరం రెసిడెన్సీలో జరుగుతుంది. సభలో గుంటూరు లక్ష్మీనరసయ్య, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, చిగురుపల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొంటారు.

శ్రీకాకుళ సాహితి

కవితలకు ఆహ్వానం

మల్లెతీగ పురస్కారం–2026 కోసం కవితలు ఆహ్వానిస్తున్నాం. ప్రధాన పురస్కారం రూ .8 వేలు, ఆత్మీయ పురస్కారం రూ.1000 చొప్పున ఐదుగురికి. సామాజికాంశాల్ని స్పృశించే కవితల్ని జూన్‌ 30లోపు మీ ఫొటోపాటు కొరియర్ లేదా రిజిస్టర్ పోస్టులో ఎడిటర్, నవమల్లెతీగ, 26–16–4, టి–ఎఫ్ 1, శుభశ్రీ టవర్స్, ఉయ్యూరు జమిందార్ స్ట్రీట్, గాంధీ నగర్, విజయవాడ–520003, ఫోన్‌: 92464 15150 కు, లేదా ఈమెయిల్ ద్వారా malleteega.sss@gmail.comకు పంపాలి.

కలిమిశ్రీ

ఇవి కూడా చదవండి..

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

Updated Date - Jun 15 , 2026 | 02:16 AM