ఈ వారం వివిధ కార్యక్రమాలు 1 06 2026
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:52 AM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, కవిసమ్మేళనం, విజయవాడ గ్రంథాలయాల సందర్శన యాత్ర...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, కవిసమ్మేళనం
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ఆవిర్భావ సభ, కవి సమ్మేళనం జూన్ 4 సా.4గంటలకు అశోక కాన్ఫరెన్స్ హాల్, హనుమకొండలో జరుగుతుంది. అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య, ముఖ్య అతిథి నందిని సిధారెడ్డి, ఆత్మీయ అతిథి దేశపతి శ్రీనివాస్. కవి సమ్మేళనంలో కవులు వి.ఆర్. విద్యార్థి, రామా చంద్రమౌళి, వఝల శివకుమార్, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, వేముగంటి మురళీకృష్ణ, బిల్లా మహేందర్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 79895 25848.
మల్లావఝల విజయ్
విజయవాడ గ్రంథాలయాల సందర్శన యాత్ర
‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ చేపడుతున్న గ్రంథాలయ సందర్శన యాత్రలో భాగంగా ఈసారి విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం, రామ్మోహన్ గ్రంథాలయంతోపాటు, ఠాగూర్ పరిశోధనాత్మక గ్రంథాలయం, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం, సర్వోత్తమ గ్రంథాలయాల సందర్శనలు ఒకేరోజు ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 28న జరిగే ఈ యాత్రకు బస్సుతోపాటు, ఉచిత భోజనం, అల్పాహారం ఏర్పాటు ఉంటుంది. ప్రముఖ రచయితలు, గ్రంథాలయోద్యమకారులు పాల్గొంటారు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. ఈ యాత్రలో పాల్గొనదలచినవారు 9247475975 నెంబరులో జూన్ 10 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి.
చలపాక ప్రకాష్
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్